Asifabad: వాగు దాటి గర్భిణికి అండగా నిలిచిన 108 సిబ్బంది!

Asifabad: కొమురం భీం ఆసిఫాబాద్ జిల్లాలో పురిటినొప్పులతో బాధపడుతున్న గర్భిణికి అండగా నిలిచేందుకు 108 సిబ్బంది ప్రాణాలకు తెగించి వాగు దాటి ఆస్పత్రికి తరలించారు.

Kola Venkatesh, Staff Reporter -Mancherial
Published on: 2 Nov 2026 10:58 AM IST
Asifabad
X

Asifabad: వాగు దాటి గర్భిణికి అండగా నిలిచిన 108 సిబ్బంది!

Asifabad: ఆపదలో ఉన్నవారికి అండగా నిలిచి మానవత్వాన్ని చాటుకున్నారు 108 అంబులెన్స్ సిబ్బంది. పురిటినొప్పులతో బాధపడుతున్న గర్భిణిని ఆస్పత్రికి తరలించేందుకు వాగు దాటి సాహసోపేతంగా సేవలందించారు.

ఆసిఫాబాద్ మండలం చిలకగూడ గ్రామానికి చెందిన గర్భిణికి పురిటినొప్పులు రావడంతో కుటుంబ సభ్యులు వెంటనే 108 అంబులెన్స్‌కు ఫోన్ చేశారు. అసిఫాబాద్ లో అంబులెన్స్ అందుబాటులో లేకపోవడంతో కెరమెరి, రెబ్బెన అంబులెన్సులు ఆడ దస్నాపూర్ వాగు వద్దకు చేరుకున్నాయి. అయితే వాగు దాటడం సమస్యగా మారడంతో ఈఎంటీలు రమణ, ప్రఫుల్ ఏమాత్రం వెనుకాడకుండా వాగు దాటి గర్భిణి వద్దకు చేరుకున్నారు.

అనంతరం గర్భిణిని బైక్‌పై అంబులెన్స్ వద్దకు తీసుకొచ్చి, అక్కడి నుంచి ఆసిఫాబాద్ ప్రభుత్వ ఆస్పత్రికి తరలించి వైద్య చికిత్స కోసం చేర్పించారు. అత్యవసర సమయంలో సమయస్ఫూర్తితో స్పందించి గర్భిణికి సహాయం చేసిన 108 సిబ్బంది రమణ, ప్రఫుల్ సేవలను గ్రామస్థులు అభినందించారు. వారి మానవతా దృక్పథానికి కృతజ్ఞతలు తెలిపారు.

Kola Venkatesh, Staff Reporter -Mancherial

Kola Venkatesh, Staff Reporter -Mancherial

11 ఏళ్ల జర్నలిజం అనుభవం కలిగిన సీనియర్ పాత్రికేయుడు. రాజకీయాలు, సామాజిక అంశాలు, స్థానిక సమస్యలు మరియు ప్రత్యేక కథనాలపై విస్తృతంగా పనిచేస్తూ ప్రజలకు ఖచ్చితమైన, విశ్వసనీయమైన వార్తలను అందిస్తున్నారు.