Adilabad: ఆదిలాబాద్‌లో గణేష్ నిమజ్జనానికి భారీ బందోబస్తు!
Adilabad: ఆదిలాబాద్‌లో గణేష్ నిమజ్జనానికి పటిష్టమైన భద్రతా ఏర్పాట్లు.. 600 మంది పోలీసులతో బందోబస్తు, సీసీ కెమెరాలు, డ్రోన్లతో నిఘా ఏర్పాటు చేసినట్లు ఎస్పీ అఖిల్ మహాజన్ వెల్లడి.
Adilabad: ఆదిలాబాద్‌లో గణేష్ నిమజ్జనానికి భారీ బందోబస్తు!
Adilabad: ఆదిలాబాద్ పట్టణం గణపతి నవరాత్రి ఉత్సవాలను ఘనంగా నిర్వహించుకుని నిమర్జన కార్యక్రమానికి సిద్ధమవుతుంది. ఈ సందర్భంగా ఆదిలాబాద్ జిల్లా పోలీసు యంత్రాంగం పూర్తి అప్రమత్తతో ఉంటూ పటిష్ట బందోబస్తు చర్యలను చేపట్టిందని ఆదిలాబాద్ జిల్లా ఎస్పీ అఖిల్ మహాజన్ తెలిపారు.
పట్టణంలో 600 మంది పోలీసు సిబ్బందితో నిమర్జనోత్సవానికి ఏర్పాట్లు చేస్తున్నట్లు తెలిపారు. ప్రత్యేకంగా 600 సీసీ కెమెరాలు ఏర్పాటు చేసి 24 గంటలు కమాండ్ కంట్రోల్ సెంటర్ ద్వారా పర్యవేక్షించడం జరుగుతుందన్నారు. పట్టణంలో 13 క్లస్టర్లు సిఐ స్థాయి అధికారి చే, 13 సెక్టార్లు ఎస్సై స్థాయి అధికారిచే గా విభజించిన సిబ్బందిని అడుగడుగునా పోలీసు సిబ్బందిని ఏర్పాటు చేసి ప్రజలకు ఎలాంటి అసౌకర్యం కలగకుండా ప్రశాంత వాతావరణంలో గణపతి ఉత్సవాలను పూర్తి చేసుకొని నిమజ్జన కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని సూచించారు.
పట్టణంలో ముఖ్యమైన ప్రదేశాల నందు సమస్యత్మక ప్రాంతాల నందు 23 పికెట్స్ ను ఏర్పాటు చేసి శాశ్వతంగా పోలీసు సిబ్బందిని ఏర్పాటు చేశారు. ప్రత్యేకంగా సిఐ స్థాయి అధికారిని ఏర్పాటు చేసి రెండు స్ట్రైకింగ్ ఫోర్సులను ఏర్పాటు చేసి 15 మంది పోలీసు సిబ్బందిని అందుబాటులో ఉంచారు. పట్టణంలో ఉన్న ప్రతి ఒక్క దారిలో సెక్టర్ సిబ్బంది పెట్రోలింగ్ నిర్వహిస్తూ అవాంఛనీయ సంఘటనలు చోటు చేసుకోకుండా పర్యవేక్షిస్తారన్నారు. ప్రధానమైన రోడ్ల నందు రూఫ్ టాప్ బందోబస్తు ఏర్పాటు చేసి పర్యవేక్షిస్తున్నారు. పట్టణంలో 15 మంది కెమెరా సిబ్బంది ని ఏర్పాటు చేసి సమస్యల సృష్టించే వారిని వీడియోగ్రఫీ ద్వారా గుర్తించడం జరుగుతుందన్నారు, డ్రోన్ కెమెరాతో పట్టణంలోని పరిస్థితిని పర్యవేక్షించడం జరుగుతుందన్నారు.




