Bhainsa: భైంసాలో దుర్గామాత నిమజ్జన శోభాయాత్రకు పటిష్ట పోలీసు భద్రత!

Bhainsa: నిర్మల్ జిల్లా భైంసా పట్టణంలో దుర్గామాత నిమజ్జన శోభాయాత్రకు భారీ బందోబస్తు. 350 మంది పోలీసులతో పాటు సీసీ, డ్రోన్ కెమెరాలతో నిరంతర నిఘా.

Srinivas, Mondol Bhainsa
Published on: 21 Oct 2026 1:24 PM IST
Bhainsa
X

Bhainsa: భైంసాలో దుర్గామాత నిమజ్జన శోభాయాత్రకు పటిష్ట పోలీసు భద్రత!

Bhainsa: నిర్మల్ జిల్లా బైంసా పట్టణంలో దుర్గామాత నిమజ్జన శోభాయాత్ర సందర్భంగా పోలీసులు భారీ బందోబస్తు ఏర్పాటు చేశారు. శాంతిభద్రతలకు ఎలాంటి విఘాతం కలగకుండా ముందస్తు చర్యల్లో భాగంగా జిల్లా పోలీస్ యంత్రాంగం పట్టణంలో పటిష్ట నిఘా ఏర్పాటు చేసింది.

దుర్గామాత నిమజ్జన బందోబస్తు కోసం మొత్తం ఒక ఎస్పీ, ఇద్దరు అదనపు ఎస్పీలు, ఒక డీఎస్పీ, ఆరుగురు సీఐలు, 50 మంది ఎస్సైలు తో సహా దాదాపు 350 మంది పోలీస్ సిబ్బంది విధుల్లో పాల్గొన్నారు.

పట్టణంలోని ప్రధాన కూడళ్లు, శోభాయాత్ర మార్గంలో దాదాపు 100 సీసీ కెమెరాల ద్వారా నిరంతర నిఘా ఉంచారు. అదనంగా డ్రోన్ కెమెరాలతో ఆకాశం నుంచి నిఘా, ప్రత్యేక వీడియో గ్రాఫర్ల బృందంతో ప్రతి కదలికను రికార్డు చేస్తున్నారు.

ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా అడుగడుగునా పోలీసులు మోహరించారు. శోభాయాత్ర ప్రశాంతంగా ముగిసే వరకు బందోబస్తు కొనసాగుతుందని పోలీస్ అధికారులు తెలిపారు.

Srinivas, Mondol Bhainsa

Srinivas, Mondol Bhainsa