Gudihatnur: గుడిహత్నూర్‌లో కటింగ్ షాప్ వర్కర్‌పై లారీ డ్రైవర్ బీభత్సం
Gudihatnur: గుడిహత్నూర్‌లో కటింగ్ షాప్ వర్కర్ బాలాజీపై లారీ డ్రైవర్ దాడి. పక్కటెముకలు విరగడంతో రిమ్స్ ఆసుపత్రికి తరలింపు. పోలీసుల దర్యాప్తు.
Gudihatnur: గుడిహత్నూర్‌లో కటింగ్ షాప్ వర్కర్‌పై లారీ డ్రైవర్ బీభత్సం
గుడిహత్నూర్: మండల కేంద్రంలోని ఓ కటింగ్ షాపులో పనిచేస్తున్న బాలాజీ అనే వ్యక్తిపై లారీ డ్రైవర్ తీవ్ర దాడికి పాల్పడ్డాడు. బాధితుడి కుటుంబ సభ్యుల కథనం ప్రకారం.. బాలాజీ కటింగ్ షాపులో పనిచేస్తూ జీవనం సాగిస్తున్నాడు. స్థానిక రాజీవ్ నగర్‌కు చెందిన ఓ లారీ డ్రైవర్ ఆయనను కర్రతో విచక్షణారహితంగా కొట్టడంతో పక్కటెముకలు విరిగినట్లు కుటుంబ సభ్యులు తెలిపారు.
తీవ్ర గాయాలతో మచ్చాపూర్ గ్రామ సమీపంలోని చేనులో పడి ఉన్న బాలాజీని స్థానికులు గుర్తించి కుటుంబ సభ్యులకు సమాచారం అందించారు. వెంటనే స్పందించిన కుటుంబీకులు ఆయనను చికిత్స నిమిత్తం ఆదిలాబాద్‌లోని రిమ్స్ ఆసుపత్రికి తరలించారు. వీరిద్దరి మధ్య గొడవకు గల కారణాలు ఇంకా తెలియరాలేదు. ఈ ఘటనపై బాధిత కుటుంబ సభ్యులు స్థానిక పోలీస్ స్టేషన్‌లో ఫిర్యాదు చేశారు. పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నట్లు తెలిసింది.




