Gudihathnoor: ఉమ్రిలో ఘనంగా ఆదివాసీల దండారి ఉత్సవాలు

Gudihathnoor: గుడిహత్నూర్ మండలం ఉమ్రిలో వైభవంగా ఆదివాసీల దండారి ఉత్సవాలు. గుసాడీ నృత్యాల మధ్య స్వాగతం అందుకుని పూజలు నిర్వహించిన మాజీ ఎమ్మెల్యే రాథోడ్ బాపూరావ్.

NAGULA SATISH, BOATH
Published on: 8 Nov 2026 5:08 PM IST
Gudihathnoor
X

Gudihathnoor: ఉమ్రిలో ఘనంగా ఆదివాసీల దండారి ఉత్సవాలు

​గుడిహత్నూర్: మండలంలోని ఉమ్రి గ్రామంలో ఆదివాసీల సంప్రదాయ దండారి ఉత్సవాలు అత్యంత వైభవంగా, సంప్రదాయబద్ధంగా జరిగాయి. ఈ వేడుకల్లో తెలంగాణ రక్షణ సేన జిల్లా అధ్యక్షుడు, మాజీ ఎమ్మెల్యే రాథోడ్ బాపూరావ్ ముఖ్య అతిథిగా హాజరై ప్రత్యేక పూజలు నిర్వహించారు. సంప్రదాయ వాయిద్యాల చప్పుళ్ళు, గుసాడీ నృత్యాల నడుమ గ్రామస్తులు ఆయనకు ఘన స్వాగతం పలికారు.

​ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, ఆదివాసీల ఆచార వ్యవహారాలు, సంస్కృతి సంప్రదాయాలు సమాజానికి ఎంతో ఆదర్శవంతమైనవని, వాటిని భావితరాలకు అందించే బాధ్యత అందరిపై ఉందని పేర్కొన్నారు.

​ఈ కార్యక్రమంలో తెలంగాణ రక్షణ సేన మండల అధ్యక్షుడు పెట్ల మహేందర్, పార్టీ జడ్పీటీసీ అభ్యర్థి ఊర్వేత రోహిదాస్, పార్టీ ముఖ్య నాయకులు, కార్యకర్తలు, గ్రామ పెద్దలు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.

NAGULA SATISH, BOATH

NAGULA SATISH, BOATH