Gudihathnoor: ధామాన్ గూడ దండారి ఉత్సవాల్లో బీజేపీ నేత వాగ్మారె శైలేందర్

Gudihathnoor: ఆదిలాబాద్ జిల్లా గుడిహత్నూర్ మండలం ధామాన్ గూడలో ఆదివాసీల దండారి ఉత్సవాలు. పాల్గొని పూజలు నిర్వహించిన బీజేపీ ఎస్సీ మోర్చా జిల్లా అధ్యక్షుడు శైలేందర్.

NAGULA SATISH, BOATH
Published on: 10 Nov 2026 6:32 PM IST
Gudihathnoor
X

Gudihathnoor: ధామాన్ గూడ దండారి ఉత్సవాల్లో బీజేపీ నేత వాగ్మారె శైలేందర్

గుడిహత్నూర్: ​ఆదిలాబాద్ జిల్లా గుడిహత్నూర్ మండల పరిధిలోని ధామాన్ గూడ గ్రామంలో ఆదివాసీలు అత్యంత భక్తిశ్రద్ధలతో నిర్వహించిన దండారి ఉత్సవాల్లో బీజేపీ ఎస్సీ మోర్చా జిల్లా అధ్యక్షుడు వాగ్మారె శైలేందర్ పాల్గొన్నారు.

ఈ సందర్భంగా ఆయన గ్రామ దేవతలకు ప్రత్యేక పూజలు చేసి, ఆదివాసీల ఆచార సంప్రదాయాలు, గుస్సాడి నృత్య విశేషాలను అడిగి తెలుసుకున్నారు.

ఆదివాసీ సంస్కృతీ సంప్రదాయాలు సమాజానికి స్ఫూర్తిదాయకమని, వాటిని కాపాడుకోవాల్సిన బాధ్యత అందరిపై ఉందని ఆయన పేర్కొన్నారు. స్థానిక నాయకులు, గ్రామ పెద్దలు మరియు గ్రామస్తులు ఆయనకు సంప్రదాయబద్ధంగా ఘన స్వాగతం పలికారు.

NAGULA SATISH, BOATH

NAGULA SATISH, BOATH