Gudihathnoor: పప్పుదినుసుల సాగుతో అధిక లాభాలు: ఏవో భగత్ రమేష్ కుమార్!

Gudihathnoor: గుడిహత్నూర్ మండలం దామన్‌గూడలో 'మిషన్ ఫర్ ఆత్మనిర్భరత' పథకం కింద పప్పుదినుసుల సాగుపై రైతులకు వ్యవసాయాధికారి భగత్ రమేష్ కుమార్ అవగాహన కల్పించారు.

NAGULA SATISH, BOATH
Published on: 6 Oct 2026 10:24 PM IST
Gudihathnoor
X

Gudihathnoor: పప్పుదినుసుల సాగుతో అధిక లాభాలు: ఏవో భగత్ రమేష్ కుమార్!

గుడిహత్నూర్: ​గుడిహత్నూర్ మండలం దామన్ గూడ గ్రామంలో 'మిషన్ ఫర్ ఆత్మనిర్భరత' పథకం కింద పప్పుదినుసుల పంటల సాగుపై రైతులకు అవగాహన సదస్సు నిర్వహించారు. ఈ సందర్భంగా కంది పంట సస్యరక్షణకు అవసరమైన క్రిమిసంహారక మందులు, పోషక ఎరువులను సర్పంచ్ మడావి ముకుంద్ రావు చేతుల మీదుగా రైతులకు అందజేశారు.

​కార్యక్రమంలో మండల వ్యవసాయ అధికారి భగత్ రమేష్ కుమార్ మాట్లాడుతూ, కంది పంటలో అధిక దిగుబడులు సాధించేందుకు రైతులు సరైన సస్యరక్షణ చర్యలు చేపట్టాలని సూచించారు. కంది, పెసర, మినుము, శనగ వంటి పప్పుదినుసుల సాగు వల్ల భూసారం పెరగడంతో పాటు తక్కువ నీటితోనే మంచి దిగుబడి సాధించవచ్చని తెలిపారు.

ఎల్-నినో ప్రభావం వల్ల వర్షాభావ పరిస్థితులు నెలకొన్న నేపథ్యంలో, రబీ సీజన్‌లో ఎక్కువ నీరు అవసరమయ్యే మొక్కజొన్నకు బదులుగా ఆరుతడి పంటైన శనగ సాగు చేయాలని రైతులకు పిలుపునిచ్చారు. వ్యవసాయ శాఖ ద్వారా రాయితీపై అందించే శనగ విత్తనాలను రైతులు సద్వినియోగం చేసుకోవాలని కోరారు. అనంతరం అధికారులు గ్రామ పొలాల్లోని పత్తి, కంది పంటలను పరిశీలించారు. ఈ కార్యక్రమంలో వ్యవసాయ విస్తరణ అధికారి శృతి, ఉప సర్పంచ్ పెందోర్ కృష్ణ మరియు గ్రామ రైతులు పాల్గొన్నారు.

NAGULA SATISH, BOATH

NAGULA SATISH, BOATH