Gudihathnoor: గుడిహత్నూర్‌లో తెలంగాణ రక్షణ సేనలోకి 200 మంది భారీ చేరికలు
Gudihathnoor: గుడిహత్నూర్‌లో తెలంగాణ రక్షణ సేనలోకి 200 మంది చేరారు. అక్టోబర్ 30న ఇంద్రవెల్లి సంకల్ప సభను గెలిపించాలని మాజీ ఎమ్మెల్యే బాపూరావు పిలుపునిచ్చారు.
Gudihathnoor: గుడిహత్నూర్‌లో తెలంగాణ రక్షణ సేనలోకి 200 మంది భారీ చేరికలు
Gudihathnoor: మండల రాజకీయాల్లో తెలంగాణ రక్షణ సేన (TRS) పార్టీలోకి కొత్త చేరికలు చోటుచేసుకున్నాయి. గుడిహత్నూర్ మండల కేంద్రంలో నిర్వహించిన ఓ కార్యక్రమంలో వివిధ పార్టీలకు చెందిన సుమారు 200 మంది నాయకులు, కార్యకర్తలు టీఆర్‌ఎస్ తీర్థం పుచ్చుకున్నారు. ప్రజా సంక్షేమమే ధ్యేయంగా విద్య, వైద్యం, ఉపాధి కల్పనే తమ పార్టీ ప్రధాన ఎజెండా అని ఈ సందర్భంగా ముఖ్య నేతలు స్పష్టం చేశారు.
ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరైన టీఆర్‌ఎస్ జిల్లా అధ్యక్షుడు, బోథ్ మాజీ ఎమ్మెల్యే రాథోడ్ బాపూరావు మాట్లాడుతూ.. అక్టోబర్ 30వ తేదీన ఇంద్రవెల్లిలో పార్టీ అధ్యక్షురాలు కల్వకుంట్ల కవిత ఆధ్వర్యంలో నిర్వహించనున్న 'పాంచజన్య సంకల్ప సభ'ను ప్రతి ఒక్కరూ విజయవంతం చేయాలని పిలుపునిచ్చారు. ఈ బహిరంగ సభకు గ్రామాలు, మండలాల వారీగా నాయకులు, కార్యకర్తలు, అభిమానులు సమన్వయంతో కదిలివచ్చి పెద్ద ఎత్తున విజయవంతం చేయాలని ఆయన సూచించారు.
కార్యక్రమంలో పార్టీ స్టేట్ అబ్జర్వర్ రూప్‌సింగ్, ఆదిలాబాద్ నియోజకవర్గ ఇన్‌చార్జి వేణుగోపాల్‌రెడ్డి, విక్రాంత్‌రెడ్డి, గుడిహత్నూర్ టీఆర్‌ఎస్ జడ్పీటీసీ అభ్యర్థి ఉర్వేత రోహిదాస్, మండల అధ్యక్షుడు పిట్ల మహేందర్ తదితర ముఖ్య నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.




