Nirmal: నిర్మల్ నుండి శబరిమల అన్నదానానికి కిరాణా సరుకుల వాహనం
Nirmal: నిర్మల్ నుండి శబరిమల సమీపంలోని నారాయణతోడ్ గ్రామంలో రెండు నెలల ఉచిత అన్నదానం కోసం కిరాణా ముడి సరుకుల వాహనాన్ని జెండా ఊపి ప్రారంభించారు.
Nirmal: నిర్మల్ నుండి శబరిమల అన్నదానానికి కిరాణా సరుకుల వాహనం
నిర్మల్: నిర్మల్ జిల్లా కేంద్రం నుండి కేరళలోని శబరిమల సమీపంలోని నారాయణతోడ్ గ్రామంలో ఉచిత అన్నదానం నిర్వహించేందుకు తీసుకెళ్తున్న కిరాణా ముడి సరుకుల వాహనాన్ని జెండా ఊపి ప్రారంభించారు. అఖిలభారత అయ్యప్ప సేవా ట్రస్ట్ నిర్మల్ శాఖ ఆధ్వర్యంలో భక్తులు అందజేసిన కిరాణా సరుకులను అయ్యప్ప స్వాములకు అన్నదానం నిర్వహిస్తారు.
ఈ సందర్భంగా వాహనానికి ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఈ సందర్భంగా సభ్యులు మాట్లాడుతూ ప్రతి సంవత్సరం లాగే ఈ సంవత్సరం సైతం రెండు నెలల పాటు కొనసాగే అన్నదానానికి తమ వంతు సహాయంగా నిర్మల్ శాఖ ఆధ్వర్యంలో పంపుతున్నట్లు తెలిపారు. అయ్యప్ప సన్నిధికి సమీపంలోని నారాయణతోడ్ గ్రామంలో ప్రతిరోజు ఈ అన్నదానం కొనసాగుతుందని పేర్కొన్నారు.
అయ్యప్ప స్వాములు ఈ ఉచిత అన్నదాన కార్యక్రమాన్ని సద్వినియోగం చేసుకోవాలని తెలిపారు. ఈ కార్యక్రమంలో ట్రస్టు సభ్యులు బద్రి శ్రీనివాస్, సాదం ఆనంద్, జ్యోతిర్మయి, నాయకులు మేడారం ప్రదీప్, ఒడిస్సాల అర్జున్, మహేందర్, మండాజీ మారుతి, తదితరులు పాల్గొన్నారు.




