Nirmal: భైంసాలో అంగరంగ వైభవంగా గణనాథుల నిమజ్జన శోభాయాత్ర!

Nirmal: నిర్మల్ జిల్లా భైంసాలో వైభవంగా ప్రారంభమైన గణనాథుల నిమజ్జన శోభాయాత్ర. 700 మంది పోలీసులతో భారీ బందోబస్తు, డ్రోన్లు, సీసీ కెమెరాలతో నిఘా.

Srinivas, Mondol Bhainsa
Published on: 22 Sept 2026 1:19 PM IST
Nirmal
X

Nirmal: భైంసాలో అంగరంగ వైభవంగా గణనాథుల నిమజ్జన శోభాయాత్ర!

Nirmal: బ్రాహ్మణ గల్లి, గణేష్ నగర్ లోని గణనాథుల వద్ద స్థానిక ఎమ్మెల్యె రామారావు పటేల్, జిల్లా ఎస్పీ జానకి షర్మిలా ఐపీఎస్,సబ్ కలెక్టర్ అజ్మీరా సంకేత్,మునిసిపల్ చైర్మెన్ తుమోల్ల దత్తు,హిందు ఉత్సవ కమిటీ సభ్యులు ప్రత్యేక పూజలు నిర్వహించి శోభాయాత్రను లాంఛనంగా ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో అధికారులు, భైంసా హిందూ ఉత్సవ కమిటీ సభ్యులు పాల్గొన్నారు.

భైంసా పట్టణంలోని వివిధ కాలనీల్లో కొలువుదీరిన గణనాథులందరినీ ఒక్కచోట చేర్చి భారీ శోభాయాత్రగా గడ్డెన్న వాగు ప్రాజెక్టు వద్దకు తరలించి నిమజ్జనం చేయనున్నారు.

ఇప్పటికే భైంసా మున్సిపాలిటీ కౌన్సిల్ నిమజ్జనానికి కావాల్సిన అన్ని ఏర్పాట్లను పూర్తి చేసింది. భక్తులకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా క్రేన్లు, లైటింగ్, బారికేడ్లు ఏర్పాటు చేశారు.

నిమజ్జనం ప్రశాంతంగా, సజావుగా సాగేందుకు పోలీస్ యంత్రాంగం పటిష్ట బందోబస్తు ఏర్పాటు చేసింది. దాదాపు 700 మంది పోలీసు సిబ్బందితో పాటు 200 లకు పైగా సీసీ కెమెరాలు,డ్రోన్ వంటి అత్యాదునిక టెక్నాలజీ పరికారలతో భారీ బందోబస్తు ఏర్పాటు చేసి ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా ప్రత్యేక నిఘా పెట్టారు.

Srinivas, Mondol Bhainsa

Srinivas, Mondol Bhainsa