Nirmal: అడెల్లి మహా పోచమ్మ గంగ నీళ్ల జాతర అంగరంగ వైభవంగా ప్రారంభం!

Nirmal: నిర్మల్ జిల్లా సారంగాపూర్ మండలం అడెల్లి మహా పోచమ్మ ఆలయ గంగనీళ్ల జాతర వైభవంగా ప్రారంభమైంది. రెండు రోజుల పాటు ఈ ఉత్సవాలు కొనసాగనున్నాయి.

THAKUR ANANTH RAM SING, NIRMAL
Published on: 17 Oct 2026 12:52 PM IST
Nirmal
X

Nirmal: అడెల్లి మహా పోచమ్మ గంగ నీళ్ల జాతర అంగరంగ వైభవంగా ప్రారంభం!

Nirmal: సారంగాపూర్ మండలంలోని ప్రసిద్ధ పుణ్యక్షేత్రమైన శ్రీ మహా అడెల్లి పోచమ్మ ఆలయ గంగనీళ్ల జాతర అత్యంత వైభవంగా ప్రారంభమైంది. ప్రతీ ఏటా దసరా పండగ సమయంలో ఈ గంగనీళ్ల జాతర వేడుకలును అత్యంత వైభవంగా నిర్వహించడం ఆనవాయితీగా వస్తుంది. దశాబ్దాల కాలం నుంచి అంగరంగ వైభవంగా నడుస్తున్న ఈ ఉత్సవాలకు సుదూర ప్రాంతాల నుంచి భక్తులు తండోప తండాలుగా తల్లి వచ్చి అమ్మవారిని దర్శించుకుంటారు.

శనివారం ఉదయం ప్రారంభమైన ఈ జాతర ఆదివారం సాయంకాలనికి ముగుస్తుంది. ఈ సందర్భంగా ఆదివారం ఉదయం అమ్మవారి ఆభరణాలతో పాటు ఆయుధాలను దిలావర్పూర్ మండలంలోని న్యూ సాంగ్వి గ్రామం వద్ద ప్రత్యేక పూజలు చేసి గోదావరి జలాలతో శుద్ధి చేస్తారు.

అనంతరం అమ్మవారి ఆభరణాలను తిరిగి అడెల్లి పోచమ్మ ఆలయానికి తీసుకెళ్తారు. భక్తులు శోభాయాత్రకు మంగళహారతులతో ఘనస్వాగతాలు పలికారు. శోభాయాత్ర పోడువున ఏలాంటి ఘటనలు చేసుకోకుండా పోలీసులు బందోబస్తు ఏర్పాటు చేశారు.

THAKUR ANANTH RAM SING, NIRMAL

THAKUR ANANTH RAM SING, NIRMAL