Basara: బాసర క్షేత్రంలో అంగరంగ వైభవంగా శారదీయ శరన్నవరాత్రి ఉత్సవాలు!
Basara: బాసర జ్ఞాన సరస్వతి అమ్మవారి ఆలయంలో శరన్నవరాత్రి ఉత్సవాలు ముగింపు దశకు చేరుకున్నాయి. విజయదశమి పురస్కరించుకుని అమ్మవారు నిజరూప దర్శనంలో భక్తులకు అభయమిస్తున్నారు.
Basara: బాసర క్షేత్రంలో అంగరంగ వైభవంగా శారదీయ శరన్నవరాత్రి ఉత్సవాలు!
Basara: బాసర శ్రీ జ్ఞాన సరస్వతి అమ్మవారి క్షేత్రంలో అంగరంగ వైభవంగా కొనసాగుతున్న శారదీయ శరన్నవరాత్రి ఉత్సవాలు.
పూర్ణాహుతి లో భాగంగా నవ చండీ హోమం నిర్వహించిన ఆలయ వైదిక బృందం. ఉత్సవాలలో చివరి రోజు అమ్మవారికి మహా అభిషేకం చేసి, మంగళ వాయిద్య సేవ, పుణ్యాహ వాచనం కుంకుమార్చన లతోపాటు మహా హారతి కార్యక్రమాలు నిర్వహించిన ఆలయ అర్చకులు,వేద పండితులు.
అమ్మవారు ఈరోజు నిజరూప దర్శనం "శ్రీ జ్ఞాన సరస్వతి" మాత అవతారంలో భక్తులకు దర్శనమిస్తున్నారు. అమ్మవారికి దద్దోజనం, పాయసాన్నం నైవేద్యంగా సమర్పించారు. ఈరోజు సాయంత్రం శ్రీ జ్ఞాన సరస్వతి అమ్మవారు అశ్వ వాహనం పైన బాసర ప్రధానవీధులలో శోభాయాత్ర నిర్వహించనున్న ఆలయ అర్చకులు,అధికారులు,గ్రామ ప్రజలు.
శమ్మిపూజ, ఘట ఉద్వాసన లతో శరన్నవరాత్రి ఉత్సవాలు ముగుస్తాయి. అమ్మవారి దర్శనానికి కొనసాగుతున్న భక్తుల రద్దీ. భక్తుల రద్దీకి అనుగుణంగా అన్ని రకాల ఏర్పాట్లను చేసిన ఆలయ అధికారులు.
విజయదశమి సందర్భంగా క్షేత్ర అధిష్టాన దేవత అయిన జ్ఞాన సరస్వతి అలంకార దర్శనం. నవరాత్రులలో దశమి రోజు బాసరలో అమ్మవారిని జ్ఞాన సరస్వతి గా పూజిస్తారు. మహా సరస్వతి అమ్మవారిని ఆరాదించేవారికి బ్రహ్మజ్ఞానం వాక్ శుద్ధి మేధస్సు విద్యాబుద్ధులు లభిస్తాయి అందుకే పుట్టిన శిశువు నుండి ముముక్షువు వరకు సరస్వతీ దేవిని పూజిస్తారు. ఈమెను ఉపాసించేవారి కోరికలన్నీ సిద్ధిస్తాయని పురాణోక్తి.




