Nirmal: నిర్మల్‌లో ఘనంగా లక్ష పుష్పార్చన.. పాల్గొన్న ఏలేటి మహేశ్వర్ రెడ్డి దంపతులు!

Nirmal: నిర్మల్‌లో బీజేపీఎల్పీ నేత ఏలేటి మహేశ్వర్ రెడ్డి ఆధ్వర్యంలో దుర్గా నవరాత్రులను పురస్కరించుకుని అత్యంత వైభవంగా లక్ష పుష్పార్చన కార్యక్రమం నిర్వహించారు.

THAKUR ANANTH RAM SING, NIRMAL
Published on: 17 Oct 2026 1:17 PM IST
Nirmal
X

Nirmal: నిర్మల్‌లో ఘనంగా లక్ష పుష్పార్చన.. పాల్గొన్న ఏలేటి మహేశ్వర్ రెడ్డి దంపతులు!

Nirmal: లోక కళ్యాణార్థం బిజెఎల్పి నేత ఏలేటి మహేశ్వర్ రెడ్డి ఆధ్వర్యంలో దుర్గా నవరాత్రులను పురస్కరించుకొని లక్ష పుష్పార్చన కార్యక్రమాన్ని నిర్వహించారు, ఏలేటి మహేశ్వర్ రెడ్డి నివాస గృహంలో వేద పండితుల ఆధ్వర్యంలో మహేశ్వర్ రెడ్డి దంపతులు ప్రత్యేక పూజ కార్యక్రమాలు నిర్వహించారు. అనంతరం అమ్మవారికి లక్ష పుష్పాలతో అర్చన కార్యక్రమాన్ని చేపట్టారు.

ఈ సందర్భంగా భక్తులు చేపట్టిన లలితా సహస్ర నామాలతో ప్రాంగణం మొత్తం మారుమ్రోగింది. ఈ కార్యక్రమానికి నిర్మల్ నుంచే కాకుండా చుట్టుపక్కల గ్రామాల నుండి మాల ధారణ స్వాముల తో పాటు భక్తులు పెద్ద సంఖ్యలో హాజరయ్యారు. లక్ష పుష్పార్చన సందర్భంగా ఏర్పాటు చేసిన భారీ సెట్టింగ్లు పలువురిని విశేషంగా ఆకట్టుకున్నాయి. అనంతరం భక్తులకు అన్నప్రసాద కార్యక్రమాన్ని చేపట్టారు.

THAKUR ANANTH RAM SING, NIRMAL

THAKUR ANANTH RAM SING, NIRMAL