Adilabad: ఆదిలాబాద్‌లో వైభవంగా గణేష్ నిమజ్జన శోభాయాత్ర

Adilabad: ఆదిలాబాద్ పట్టణంలో జిల్లా కలెక్టర్ రాజర్షి షా, ఎస్పీ, ఎంపీ, ఎమ్మెల్యేల ఆధ్వర్యంలో సామూహిక వినాయక నిమజ్జన శోభాయాత్ర వైభవంగా ప్రారంభమైంది.

Annijula Srinivas Rao, Staff Reporter -Adilabad
Published on: 25 Sept 2026 4:10 PM IST
Adilabad
X

Adilabad: ఆదిలాబాద్‌లో వైభవంగా గణేష్ నిమజ్జన శోభాయాత్ర

Adilabad: ఆదిలాబాద్ పట్టణంలో సామూహిక వినాయక నిమజ్జన శోభాయాత్ర కార్యక్రమం వైభవంగా సాగుతోంది. స్థానిక వినాయక చౌక్ లోని శ్రీ సరస్వతి శిశు మందిర్ పాఠశాలలో సార్వజనిక్ వినాయక విగ్రహానికి హిందూ ఉత్సవ ఆధ్వర్యంలో జిల్లా కలెక్టర్ రాజర్సీషా ,జిల్లా ఎస్పీ అఖిల్ మహజన్, ఎమ్మెల్యే పాయల శంకర్, ఎంపీ నగేష్ లు ఈ కార్యక్రమంలో పాల్గొని వినాయకుడికి ప్రత్యేక పూజలు నిర్వహించి సామూహిక నిమజ్జన శోభాయాత్రను ప్రారంభించారు.

పట్టణంలో కొలువుదిరిన వందలాది గణనాథులు శోభాయాత్రలో పాల్గొంటున్నాయి. చిన్నారుల సాంస్కృతిక కార్యక్రమాలు యువతి యువకుల నృత్యాలు డప్పు దరువుల మధ్య వైభవంగా శోభయాత్ర కొనసాగుతోంది.

Annijula Srinivas Rao, Staff Reporter -Adilabad

Annijula Srinivas Rao, Staff Reporter -Adilabad

మూడు దశాబ్దాల సుదీర్ఘ అనుభవంతో, ఆదిలాబాద్ జిల్లా రాజకీయ, సామాజిక మరియు గిరిజన ప్రాంతాల పరిణామాలపై అపారమైన పట్టున్న ‘సీనియర్ స్టాఫ్ రిపోర్టర్’.