Nirmal: నిర్మల్ జిల్లాలో వరుస దొంగతనాల ముఠా గుట్టురట్టు!

Nirmal: నిర్మల్ జిల్లాలో వరుస దొంగతనాలకు పాల్పడుతున్న ఐదుగురిని పోలీసులు అరెస్ట్ చేసి, 170 తులాల వెండి, 13 గ్రాముల బంగారం, బైక్‌లను స్వాధీనం చేసుకున్నారు.

Srinivas, Mondol Bhainsa
Published on: 24 Oct 2026 2:30 PM IST
Nirmal
X

Nirmal: నిర్మల్ జిల్లాలో వరుస దొంగతనాల ముఠా గుట్టురట్టు!

Nirmal: నిర్మల్ జిల్లా భైంసా, లోకేశ్వరం, నర్సాపూర్‌-జి, దిలావర్‌పూర్‌ మండలాల్లోని పలు గ్రామాల్లో దేవాలయాలు, ఇళ్లలో రాత్రి వేళల్లో వరుసగా జరిగిన దొంగతనాలను పోలీసులు ఛేదించారు. ఐదుగురు నిందితులను అరెస్ట్‌ చేసి, వారి వద్ద నుంచి 170 తులాల వెండి ఆభరణాలు, 13 గ్రాముల బంగారు ఆభరణాలు, రూ.22 వేల నగదు, రెండు మోటార్‌ సైకిళ్లు, మూడు సెల్‌ఫోన్లను స్వాధీనం చేసుకున్నారు.

గత ఆగస్టు 22న బిజ్జూర్‌ గ్రామంలో దొంగతనానికి యత్నిస్తున్న నిందితులను గమనించిన గ్రామస్తులు పోలీసులకు సమాచారం అందించారు. అక్కడి నుంచి తప్పించుకుని మాటేగాం వైపు వెళ్తున్న నిందితులను మాటేగాం ఎక్స్‌రోడ్డు వద్ద ప్రత్యేక పోలీసు బృందాలు పట్టుకున్నాయి. వీరిలో ముగ్గురు ఎడ్బిడ్‌ గ్రామానికి చెందినవారు కాగా, మరో ఇద్దరు నిజామాబాద్‌ జిల్లాకు చెందినవారు.

అనంతరం సెప్టెంబర్‌ 14న నిందితులను పోలీసు కస్టడీకి తీసుకుని విచారించగా, దొంగిలించిన ఆభరణాలు, నగదును స్వాధీనం చేసుకున్నారు. జిల్లా ఎస్పీ డాక్టర్‌ జి. జానకి షర్మిల ఐపీఎస్‌ ఆదేశాలతో ప్రత్యేక బృందాలు ఈ కేసులను ఛేదించాయి. ఏఎస్పీ పత్తిపాక సాయి కిరణ్‌ ఐపీఎస్‌ పర్యవేక్షణలో భైంసా రూరల్‌ సీఐ ఎం. ప్రవీణ్‌కుమార్‌, ఎస్‌ఐ ఎం. సుప్రియ, పోలీసు సిబ్బంది కీలకంగా వ్యవహరించారు. నిందితులను పట్టుకోవడంలో కృషి చేసిన పోలీసు అధికారులను, సిబ్బందిని ఎస్పీ అభినందించారు.

Srinivas, Mondol Bhainsa

Srinivas, Mondol Bhainsa