Adilabad: ప్రచారాలు మాని అభివృద్ధిపై దృష్టి పెట్టండి: జోగు రామన్న!

Adilabad: బీజేపీ ఎంపీ గోడం నగేష్, ఎమ్మెల్యే పాయల్ శంకర్‌పై మాజీ మంత్రి జోగు రామన్న తీవ్ర విమర్శలు. ప్రచార ఆర్భాటాలు మాని రైల్వే లైన్, ఆదిలాబాద్ అభివృద్ధిపై దృష్టి పెట్టాలని డిమాండ్.

Annijula Srinivas Rao, Staff Reporter -Adilabad
Published on: 19 Sept 2026 7:06 PM IST
Adilabad
X

Adilabad: ప్రచారాలు మాని అభివృద్ధిపై దృష్టి పెట్టండి: జోగు రామన్న!

అదిలాబాద్: అదిలాబాద్ బిజెపి ఎంపీ, ఎమ్మెల్యే రాజకీయ ప్రచారానికి పరిమితం కాకుండా అభివృద్ధిపై దృష్టి సారించాలి అన్నారు మాజీ మంత్రి జోగు రామన్న.... అదిలాబాద్ టిఆర్ఎస్ పార్టీ కార్యాలయంలో మీడియాతో ఆయన మాట్లాడుతూ బీజేపీ నాయకులు రోజురోజుకు విభిన్న తరహాలో వ్యవహరిస్తూ, రాజకీయ ప్రయోజనాల కోసం ప్రజలను మోసం చేయగలిగామణి,

ఇక రాజకీయ ప్రయోజనాల కోసం దేవుడిని కూడా రాజకీయాలకు ఉపయోగించుకునే స్థాయికి వారి వ్యవహార శైలి చేరిందనీ మాజీ మంత్రి జోగు రామన్న ఆరోపించారు. ఈ సందర్భంగా స్థానిక ఎంపీ నగేష్ ఎమ్మెల్యే పాయల శంకర్ లు రాజకీయ ప్రయోజనాల కోసం ఆలోచించడం మానుకుని ఆదిలాబాద్ అభివృద్ధిపై దృష్టి సారించాలని డిమాండ్ చేశారు.

ఆదిలాబాద్‌లో అభివృద్ధి పనులను ముందుకు తీసుకెళ్లకుండా కేవలం కమిషన్లకు సంబంధించిన పనులకే ప్రాధాన్యత ఇస్తున్నారనే ఆరోపణలను ఆయన చేశారు.రైల్వే పనులపై సమాధానం చెప్పాలని,

ఆదిలాబాద్–ఆర్మూర్ రైల్వే లైన్‌తో పాటు జైనథ్, బేల ప్రాంతాల ప్రజలు ఎదురుచూస్తున్న రైల్వే పనులపై స్థానిక ఎంపీ, ఎమ్మెల్యేలు ఎందుకు నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నారని జోగు రామన్న ప్రశ్నించారు. ఆదిలాబాద్‌కు రావాల్సిన రైల్వే ఫిట్‌లైన్ పనులు మహారాష్ట్రకు తరలిపోవడం స్థానిక ప్రజాప్రతినిధుల నిర్లక్ష్యానికి నిదర్శనమన్నారు.

ఆదిలాబాద్ రైల్వే స్టేషన్‌ను అమృత్ 2.0 పథకం కింద అభివృద్ధి చేస్తారని ప్రజలు ఆశించారని, అయితే ఇప్పటికీ పనులు ముందుకు సాగకపోవడంపై ఎంపీ, ఎమ్మెల్యేలు సమాధానం చెప్పాలని డిమాండ్ చేశారు. రైల్వే స్టేషన్ అభివృద్ధి పనులు ప్రారంభమైతే ప్రయాణికులకు మెరుగైన సౌకర్యాలు అందుబాటులోకి వస్తాయని అన్నారు.

Annijula Srinivas Rao, Staff Reporter -Adilabad

Annijula Srinivas Rao, Staff Reporter -Adilabad

మూడు దశాబ్దాల సుదీర్ఘ అనుభవంతో, ఆదిలాబాద్ జిల్లా రాజకీయ, సామాజిక మరియు గిరిజన ప్రాంతాల పరిణామాలపై అపారమైన పట్టున్న ‘సీనియర్ స్టాఫ్ రిపోర్టర్’.