Nirmal: అడె!ల్లి మహా పోచమ్మ అమ్మవారిని దర్శించుకున్న ఇంద్రకరణ్ రెడ్డి!

Nirmal: నిర్మల్ జిల్లా సారంగాపూర్ మండలం అడెల్లి మహా పోచమ్మ అమ్మవారి గంగనీళ్ల జాతరలో పాల్గొన్న మాజీ మంత్రి అల్లోల ఇంద్రకరణ్ రెడ్డి దంపతులు. ప్రత్యేక పూజలు!

THAKUR ANANTH RAM SING, NIRMAL
Published on: 18 Oct 2026 7:02 PM IST
Nirmal
X

Nirmal: అడె!ల్లి మహా పోచమ్మ అమ్మవారిని దర్శించుకున్న ఇంద్రకరణ్ రెడ్డి!

Nirmal: నిర్మల్ జిల్లా సారంగాపూర్ మండలంలోని అడెల్లి గ్రామంలో నిర్వహించిన శ్రీ అడెల్లి మహా పోచమ్మ అమ్మవారి గంగనీళ్ల జాతర సందర్భంగా మాజీ మంత్రి అల్లోల ఇంద్రకరణ్ రెడ్డి దంపతులు అమ్మవారిని దర్శించుకున్నారు. ఈ సందర్భంగా ఆలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించి అమ్మవారి ఆశీస్సులు పొందారు.

అడెల్లి మహా పోచమ్మ అమ్మవారి గంగనీళ్ల జాతరను పురస్కరించుకుని ఆలయ పరిసరాలు భక్తులతో సందడిగా మారాయి. వివిధ ప్రాంతాల నుంచి పెద్ద సంఖ్యలో భక్తులు తరలివచ్చి అమ్మవారికి మొక్కులు చెల్లించుకున్నారు. భక్తుల కొంగుబంగారంగా, కోరిన కోర్కెలు తీర్చే తల్లిగా ప్రసిద్ధిగాంచిన అడెల్లి మహా పోచమ్మ అమ్మవారిని దర్శించుకోవడం ఎంతో ఆనందంగా ఉందని ఈ సందర్భంగా పేర్కొన్నారు.

అనంతరం నిర్మల్ మండలంలోని ఎల్లపెల్లి గ్రామంలో కొలువైన దుర్గామాత అమ్మవారిని మాజీ మంత్రి అల్లోల ఇంద్రకరణ్ రెడ్డి దంపతులు దర్శించుకుని ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఈ సందర్భంగా అమ్మవారి కృపాకటాక్షాలు ప్రజలందరిపై ఉండాలని, ప్రజలందరూ సుఖసంతోషాలతో, ఆయురారోగ్యాలతో వర్ధిల్లాలని ప్రార్థించారు.

తెలంగాణ రాష్ట్రం సుభిక్షంగా ఉండాలని, రైతులు పాడిపంటలతో ఆనందంగా ఉండాలని, ప్రజలందరికీ అమ్మవారి ఆశీస్సులు ఎల్లప్పుడూ ఉండాలని ఆకాంక్షించారు.

THAKUR ANANTH RAM SING, NIRMAL

THAKUR ANANTH RAM SING, NIRMAL