Nirmal: నిర్మల్‌లో ముగిసిన వన్యప్రాణి సప్త వారోత్సవాలు ఘనంగా బైక్ ర్యాలీ

Nirmal: నిర్మల్ జిల్లా కడెం మండలంలో ముగిసిన వన్యప్రాణి సప్త వారోత్సవాలు. అటవీశాఖ అధికారుల ఆధ్వర్యంలో భారీ బైక్ ర్యాలీ నిర్వహించిన వైనం.

RAKESH N, KHANAPUR
Published on: 8 Oct 2026 12:00 PM IST
Nirmal
X

Nirmal: నిర్మల్‌లో ముగిసిన వన్యప్రాణి సప్త వారోత్సవాలు ఘనంగా బైక్ ర్యాలీ

Nirmal: నిర్మల్ జిల్లా కడెం మండల కేంద్రం వన్యప్రాణి సంరక్షణ నినాదాలతో హోరెత్తింది. గత వారం రోజులుగా జరుగుతున్న వన్యప్రాణి సప్త వారోత్సవాలు నేటితో ముగిశాయి. ముగింపు వేడుకల్లో భాగంగా అటవీశాఖ అధికారులు భారీ బైక్ ర్యాలీని నిర్వహించారు.

ఈ ర్యాలీలో ఖానాపూర్ ఫారెస్ట్ డివిజన్ అధికారులు, సిబ్బందితో పాటు స్థానిక జడ్పీ హైస్కూల్ విద్యార్థులు పెద్ద ఎత్తున పాల్గొన్నారు. చేతుల్లో ప్లకార్డులు పట్టుకుని వన్యప్రాణులను కాపాడుకుందాం.. అడవులను రక్షించుకుందాం అంటూ విద్యార్థులు చేసిన నినాదాలు ప్రజలను ఆకట్టుకున్నాయి.

అనంతరం అటవీశాఖ అధికారులు మాట్లాడుతూ.. అంతరించిపోతున్న అరుదైన జంతుజాలాన్ని కాపాడుకోవాల్సిన బాధ్యత ప్రతి ఒక్కరిపై ఉందన్నారు. ప్రకృతి సమతుల్యత దెబ్బతినకుండా ఉండాలంటే వన్యప్రాణుల సంరక్షణ ఎంతో అవసరమని, అడవులను నరికివేయకుండా జంతువులకు సురక్షితమైన వాతావరణాన్ని కల్పించాలని పిలుపునిచ్చారు.

RAKESH N, KHANAPUR

RAKESH N, KHANAPUR