Ichoda: విదేశీ ఉద్యోగం పేరుతో రూ.2 లక్షల మోసం: నిందితుడి అరెస్ట్
Ichoda: సింగపూర్‌లో ఉద్యోగం పేరిట రూ.2 లక్షలు వసూలు చేసి నకిలీ ఆఫర్ లెటర్ ఇచ్చిన నిందితుడు అనిల్ కుమార్‌ను ఇచ్చోడ పోలీసులు అరెస్ట్ చేశారు.
Ichoda: విదేశీ ఉద్యోగం పేరుతో రూ.2 లక్షల మోసం: నిందితుడి అరెస్ట్
ఇచ్చోడ: విదేశాల్లో ఉద్యోగం ఇప్పిస్తానని చెప్పి రూ.2 లక్షలు మోసం చేసిన నిందితుడిని అరెస్ట్ చేసినట్లు ఇచ్చోడ సీఐ వి. ప్రవీణ్ కుమార్ తెలిపారు. జామిడి గ్రామానికి చెందిన పిలవన్ శ్యామ్ హైదరాబాద్‌లో కోచింగ్ తీసుకుంటున్న సమయంలో, అమీర్‌పేటలోని ఓ కన్సల్టెన్సీలో పనిచేసే ప్రకాశం జిల్లాకు చెందిన గోచిపాతుల అనిల్ కుమార్ (28)తో పరిచయం ఏర్పడింది.
సింగపూర్‌లో ఉద్యోగ వీసా ఇప్పిస్తానని నమ్మించడంతో బాధితుడు విడతల వారీగా రూ.2 లక్షలు చెల్లించాడు. ఆ తర్వాత నిందితుడు వాట్సాప్‌లో నకిలీ ఆఫర్ లెటర్ పంపించి, ఫోన్లకు స్పందించడం మానేశాడు. మోసపోయానని గ్రహించిన బాధితుడి ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి నిందితుడిని అదుపులోకి తీసుకున్నారు. గుర్తుతెలియని వ్యక్తులు, కన్సల్టెన్సీలను నమ్మి డబ్బులు ఇచ్చి మోసపోవద్దని సీఐ ప్రజలను కోరారు.




