Adilabad: ఆదిలాబాద్ రిమ్స్ క్యాంటీన్‌లో తనిఖీలు.. నోటీసులు జారీ!
Adilabad: ఆదిలాబాద్ రిమ్స్ డైట్ క్యాంటీన్‌లో ఫుడ్ సేఫ్టీ తనిఖీలు నిర్వాహకులకు నోటీసులు జారీ ఆహార నమూనాల సేకరణ రోగుల ఆరోగ్య భద్రతపై రాజీ పడేది లేదని హెచ్చరిక.
Adilabad: ఆదిలాబాద్ రిమ్స్ క్యాంటీన్‌లో తనిఖీలు.. నోటీసులు జారీ!
ఆదిలాబాద్: ఆదిలాబాద్ రిమ్స్ డైట్ క్యాంటీన్‌ను ఫుడ్ సేఫ్టీ ఆఫీసర్ ప్రత్యూష తనిఖీ చేశారు. ఈ సందర్భంగా తనిఖీలో క్యాంటీన్‌లో గుర్తించిన చిన్నపాటి లోపాలపై నిర్వాహకులకు నోటీసులు జారీ చేస్తూ, వాటిని వెంటనే సరిదిద్దుకోవాలని ఆదేశించారు.
అంతేకాకుండా, ఆహార నాణ్యతను పరిశీలించేందుకు గాను పలు ఆహార నమూనాలను సేకరించినట్లు తెలిపారు. ఫుడ్ కమిషన్ ఛైర్మన్ ఆదేశాలతో రోగుల ఆరోగ్య భద్రతను దృష్టిలో ఉంచుకుని తనిఖీ చేపట్టామన్నారు.




