Adilabad: సోనాల మండలంలో అగ్నిప్రమాదం రైతు పశువుల కొట్టం దగ్ధం!
Adilabad: ఆదిలాబాద్ జిల్లా సోనాల మండలంలో భారీ అగ్నిప్రమాదం. ఫుల్‌సింగ్ నాయక్ తండాలో రైతు జోర్‌సింగ్ పశువుల కొట్టం దగ్ధం.
Adilabad: సోనాల మండలంలో అగ్నిప్రమాదం రైతు పశువుల కొట్టం దగ్ధం!
Adilabad: ఆదిలాబాద్ జిల్లా సోనాల మండల పరిధిలోని ఫుల్‌సింగ్ నాయక్ తండాలో ఆదివారం భారీ అగ్ని ప్రమాదం చోటుచేసుకుంది. తండాకు చెందిన రైతు జోర్‌సింగ్ పశువుల కొట్టంలో అకస్మాత్తుగా మంటలు చెలరేగాయి. క్షణాల్లోనే మంటలు కొట్టం మొత్తం వ్యాపించడంతో అందులో ఉన్న పశువుల మేతతో పాటు విలువైన వ్యవసాయ సామగ్రి పూర్తిగా బూడిదయ్యాయి.
ఈ ప్రమాదంలో వ్యవసాయానికి వినియోగించే విద్యుత్ మోటార్, వైర్లు, పైపులు, స్ప్రింక్లర్ సెట్లు, వ్యవసాయ పనిముట్లతో పాటు నిల్వ ఉంచిన యూరియా, డీఏపీ ఎరువుల సంచులు పూర్తిగా అగ్నికి ఆహుతయ్యాయి. కళ్లముందే సామగ్రి అంతా కాలిపోవడంతో బాధితుడు తీవ్ర ఆవేదన వ్యక్తం చేస్తున్నాడు. కాగా, ప్రమాదం జరగడానికి గల కారణాలు ఇంకా స్పష్టంగా తెలియరాలేదు. ఈ ఘటనపై సమాచారం అందుకున్న అధికారులు నష్ట తీవ్రతను అంచనా వేస్తున్నారు. ప్రభుత్వం స్పందించి తనను ఆదుకోవాలని బాధిత రైతు కోరుతున్నాడు.




