Tanoor: పాముకాటు బాధితుడికి భోస్లే మోహన్ రావ్ పటేల్ ఆర్థిక సాయం

Tanoor: తానూరు మండలం తొండలాలో పాముకాటుతో మృతి చెందిన సాహెబు కుటుంబానికి భోస్లే మోహన్ రావ్ పటేల్ ప్రజా ట్రస్ట్ ద్వారా రూ.10 వేల ఆర్థిక సాయం అందించారు.

Srinivas, Mondol Bhainsa
Published on: 25 Oct 2026 9:31 PM IST
Tanoor
X

Tanoor: పాముకాటు బాధితుడికి భోస్లే మోహన్ రావ్ పటేల్ ఆర్థిక సాయం

నిర్మల్ జిల్లా: తానూర్ మండలం తొండలా గ్రామానికి చెందిన సాహెబు అనే వ్యక్తి కొద్దిరోజుల క్రితం పాము కాటుకు గురై మృతి చెందాడు. ఈ విషయం తెలుసుకున్న మోహన్ రావ్ పటేల్ ప్రజా ట్రస్ట్ చైర్మన్ భోస్లే మోహన్ రావ్ పటేల్ ఈరోజు తొండలా గ్రామంలోని వారి నివాసానికి వెళ్లి కుటుంబాన్ని పరామర్శించి ప్రగాఢ సంతాపం తెలియజేశారు. తన వంతు సహాయంగా మోహన్ రావ్ పటేల్ ప్రజా ట్రస్ట్ ద్వారా 10 వేల రూపాయల ఆర్థిక సహాయాన్ని చెక్కు రూపంలో గ్రామస్థుల సమక్షంలో అందించారు. ఆపదలో ఉన్నవారికి చేయూతనిస్తున్న ట్రస్ట్ సేవలను గ్రామస్థులు అభినందించారు.

Srinivas, Mondol Bhainsa

Srinivas, Mondol Bhainsa