Chennur: ఓటరు జాబితా హియరింగ్ వేగవంతం చేయాలి: అదనపు కలెక్టర్ రాములు

Chennur: చెన్నూర్, భీమారంలో ఓటరు జాబితా సవరణ విచారణలు, సాదాబైనామా, భూ భారతి, రీ-సర్వే పనులపై అదనపు కలెక్టర్ వి. రాములు సమీక్ష నిర్వహించారు.

RAJENDER, CHENNUR
Published on: 18 Sept 2026 7:45 PM IST
Chennur
X

Chennur: ఓటరు జాబితా హియరింగ్ వేగవంతం చేయాలి: అదనపు కలెక్టర్ రాములు

మంచిర్యాల జిల్లా: ఓటరు జాబితా ప్రత్యేక సమగ్ర సవరణలు మ్యాపింగ్ కాని, అనమలిస్ జాబితాలో గల ఓటర్లకు అందించిన నోటీసుల ప్రకారం హియరింగ్ ప్రక్రియ వేగవంతం చేసి నిర్ణీత గడువులోగా పూర్తి చేసే విధంగా చర్యలు తీసుకోవాలని జిల్లా అదనపు కలెక్టర్ (రెవెన్యూ) వి.రాములు అన్నారు.

శుక్రవారం జిల్లాలోని చెన్నూరు మండల తహసిల్దార్ కార్యాలయాన్ని సందర్శించి వివిధ రెవెన్యూ సంబంధిత అంశాలపై అధికారులతో సమీక్ష నిర్వహించారు.

ఈ సందర్భంగా జిల్లా అదనపు కలెక్టర్ మాట్లాడుతూ....!

ప్రత్యేక సమగ్ర సవరణ ప్రక్రియలో భాగంగా ఇప్పటికే నిర్వహించిన విచారణలకు సంబంధించిన కేసుల డిజిటలైజేషన్ ప్రక్రియను వేగవంతం చేయాలని, రానున్న 2 రోజులలో పురోగతి స్పష్టంగా కనిపించేలా చర్యలు చేపట్టాలని తెలిపారు.

సాదాబైనామా, భూ భారతి దరఖాస్తుల పురోగతిని సమీక్షించి, పెండింగ్‌లో ఉన్న దరఖాస్తులను ప్రాధాన్యత క్రమంలో పరిశీలించి త్వరితగతిన పరిష్కరించాలని సూచించారు.

చెన్నూర్ మండలం ‌కిష్టంపేట గ్రామంలో చేపడుతున్న రీ-సర్వే ప్రక్రియను సమీక్షించి, సర్వే పనులను వేగవంతం చేసి, కో-రిలేషన్ స్టేట్‌మెంట్ తయారీ ప్రక్రియను త్వరితగతిన పూర్తి చేయాలని అధికారులకు సూచించారు.

చెన్నూర్ గ్రామంలో రీ-సర్వేలో భాగంగా ప్రారంభమైన గ్రామ సరిహద్దుల నిర్ధారణ ప్రక్రియను క్షేత్రస్థాయిలో పరిశీలించి, సర్వే ప్రక్రియను నిర్ణీత ప్రణాళిక ప్రకారం సమర్థవంతంగా పూర్తి చేయాలని తెలిపారు.

అనంతరం, భీమారం మండల తహసీల్దార్ కార్యాలయాన్ని సందర్శించి ఓటరు జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ, సాదాబైనామా, భూ భారతి, రీ-సర్వే తదితర అంశాలపై సమీక్ష నిర్వహించారు. ఎస్.ఐ.ఆర్. కు సంబంధించి విచారణలు పూర్తయిన కేసుల డిజిటలైజేషన్‌ను వేగవంతం చేయాలని తెలిపారు. సాదాబైనామా, భూ భారతి దరఖాస్తులను ప్రాధాన్యతతో పరిశీలించి త్వరితగతిన పరిష్కరించాలని సూచించారు.

మండలంలోని మద్దికల్ గ్రామంలో కొనసాగుతున్న రీ-సర్వే ప్రక్రియను సమీక్షించి, సర్వే పనులను వేగవంతం చేయడంతో పాటు కో-రిలేషన్ స్టేట్‌మెంట్ తయారీని త్వరితగతిన పూర్తి చేయాలని అధికారులను ఆదేశించారు.

ఈ కార్యక్రమంలో సంబంధిత అధికారులు తదితరులు పాల్గొన్నారు.

RAJENDER, CHENNUR

RAJENDER, CHENNUR