Adilabad: బీఆర్ఎస్, కాంగ్రెస్ పాలనపై మాజీ ఎమ్మెల్యే బాపురావు తీవ్ర విమర్శలు!
Adilabad: గత పదేళ్ల బీఆర్ఎస్, ప్రస్తుత కాంగ్రెస్ పాలనలో ప్రజలకు చేసింది ఏమీ లేదని మాజీ ఎమ్మెల్యే రాథోడ్ బాపురావు ధ్వజం.
Adilabad: బీఆర్ఎస్, కాంగ్రెస్ పాలనపై మాజీ ఎమ్మెల్యే బాపురావు తీవ్ర విమర్శలు!
Adilabad: గత పదేళ్ల బిఆర్ఎస్ పాలనలో, ప్రస్తుత కాంగ్రెస్ పాలనలో రాష్ట్ర ప్రజలకు చేసింది ఏమీ లేదని టిఆర్ఎస్ జిల్లా అధ్యక్షుడు, మాజీ ఎమ్మెల్యే రాథోడ్ బాపు రావు ఆరోపించారు. ఆదిలాబాద్ లో ఆయన మీడియాతో మాట్లాడారు. ఈనెల 30న పార్టీ అధ్యక్షురాలు కల్వకుంట్ల కవిత ఆధ్వర్యంలో ఇంద్రవెల్లిలో నిర్వహిస్తున్న పాంచ జన్య సంకల్ప సభ పోస్టర్ లను ఆయన ఆవిష్కరించారు.
ప్రస్తుతం రాష్ట్రంలో రైతుల పరిస్థితి దారుణంగా ఉందని ఎవరు పట్టించుకోవడంలేదని అన్నారు. ప్రజా సమస్యలపై అందరికంటే ముందు పార్టీ అధ్యక్షురాలు కల్వకుంట్ల కవిత స్పందిస్తున్నారని పేర్కొన్నారు. జిల్లాలో నిర్వహించే బహిరంగ సభను విజయవంతం చేయాలని కోరారు




