Adilabad: జిల్లాలో 'అగ్రిస్టాక్' పకడ్బందీ అమలుకు కలెక్టర్ ఆదేశం!

Adilabad: ఆదిలాబాద్ జిల్లాలో అగ్రిస్టాక్ ప్రాజెక్ట్, డిజిటల్ క్రాప్ సర్వే, రైతులకు ధ్రువీకరించిన ఐడీలు, కౌలు గుర్తింపు కార్డుల జారీపై కలెక్టర్ రాజర్షి షా సమీక్షించారు.

NAGULA SATISH, BOATH
Published on: 5 Nov 2026 9:56 PM IST
Adilabad
X

Adilabad: జిల్లాలో 'అగ్రిస్టాక్' పకడ్బందీ అమలుకు కలెక్టర్ ఆదేశం!

​ఆదిలాబాద్: రైతులకు ప్రభుత్వ పథకాలు, సేవలను పారదర్శకంగా అందించేందుకు ఉద్దేశించిన ‘అగ్రిస్టాక్’ ప్రాజెక్టును జిల్లాలో పకడ్బందీగా అమలు చేయాలని కలెక్టర్ రాజర్షి షా అధికారులను ఆదేశించారు. గురువారం కలెక్టరేట్‌లో నిర్వహించిన జిల్లా స్థాయి టాస్క్‌ఫోర్స్ సమావేశంలో ఆయన మాట్లాడుతూ, భూ రికార్డుల అనుసంధానం, డిజిటల్ క్రాప్ సర్వేను వేగవంతం చేయాలని స్పష్టం చేశారు.

ఆధార్ లింకింగ్, ఈ-కేవైసీ సమస్యలను త్వరితగతిన పరిష్కరించి రైతులకు ధ్రువీకరించిన ఐడీలు జారీ చేయడంతో పాటు, కౌలు రైతులకు గుర్తింపు కార్డులు అందేలా ప్రత్యేక చర్యలు తీసుకోవాలని సూచించారు. క్షేత్రస్థాయి సమస్యల పరిష్కార ప్రతిపాదనలను పోర్టల్‌లో అప్‌లోడ్ చేయాలని అధికారులను ఆదేశించారు. ఈ సమీక్షలో డిప్యూటీ కలెక్టర్ వంశీకృష్ణతో పాటు పలువురు జిల్లా అధికారులు పాల్గొన్నారు.

NAGULA SATISH, BOATH

NAGULA SATISH, BOATH