Mamada: దిమ్మదుర్తిలో అర్హులైన పేదలందరికీ ఇందిరమ్మ ఇళ్లు: కలెక్టర్

Mamada: నిర్మల్ జిల్లా మామడ మండలం దిమ్మదుర్తిలో అర్హులైన నిరుపేదలకు ఇందిరమ్మ ఇళ్లు మంజూరు చేయాలని కలెక్టర్ భవేశ్ మిశ్రా అధికారులను ఆదేశించారు.

THAKUR ANANTH RAM SING, NIRMAL
Published on: 24 Oct 2026 3:46 PM IST
Mamada
X

Mamada: దిమ్మదుర్తిలో అర్హులైన పేదలందరికీ ఇందిరమ్మ ఇళ్లు: కలెక్టర్

నిర్మల్: మామడ మండలం దిమ్మదుర్తి గ్రామంలో ఇళ్లు లేని అర్హులైన పేదలందరికీ ఇందిరమ్మ ఇళ్లు అందేలా చర్యలు తీసుకుంటామని జిల్లా కలెక్టర్ భవేశ్ మిశ్రా తెలిపారు. శనివారం దిమ్మదుర్తి గ్రామంలో కలెక్టర్ పర్యటించి ప్రజల సమస్యలను అడిగి తెలుసుకున్నారు.

ఈ సందర్భంగా ఇందిరమ్మ ఇళ్ల కోసం వచ్చిన దరఖాస్తులను క్షేత్రస్థాయిలో పరిశీలించి, అర్హత ఉన్న ప్రతి కుటుంబానికి నిబంధనల ప్రకారం ఇళ్లు మంజూరు చేయాలని అధికారులను ఆదేశించారు. గ్రామంలో పలు ఇళ్లను కలెక్టర్ స్వయంగా పరిశీలించారు.

ప్రభుత్వ సంక్షేమ పథకాలు అర్హులైన పేదలకు పూర్తిస్థాయిలో అందేలా అధికారులు ప్రత్యేక శ్రద్ధ వహించాలని సూచించారు. ఇందిరమ్మ ఇళ్ల విషయంలో సాంకేతిక సమస్యలు ఉంటే వాటిని వెంటనే గుర్తించి పరిష్కరించాలని ఆదేశించారు.

ఈ కార్యక్రమంలో హౌసింగ్ పీడీ శ్రీనివాస్, తహసీల్దార్ శ్రీనివాస్, ఎంపీడీవో విజయ్‌కుమార్, స్థానిక ప్రజాప్రతినిధులు, అధికారులు, సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.

THAKUR ANANTH RAM SING, NIRMAL

THAKUR ANANTH RAM SING, NIRMAL