Bhainsa: వేషం జోకర్లది.. ఆశయం మాత్రం ఎంతో విలువైనది!
Bhainsa: రోడ్డు ప్రమాదంలో ప్రాణస్నేహితుడిని కోల్పోయిన ముగ్గురు భైంసా యువకులు కన్నీటిని దిగమింగి జోకర్ల వేషంలో సోమవారం రోడ్డు భద్రతపై అవగాహన కల్పించారు.
Bhainsa: వేషం జోకర్లది.. ఆశయం మాత్రం ఎంతో విలువైనది!
నిర్మల్ జిల్లా: భైంసా నవ్వించే వేషాల వెనుక..! కన్నీరు పెట్టించే కథ! నెల రోజుల క్రితం రోడ్డు ప్రమాదంలో ప్రాణస్నేహితుడిని కోల్పోయిన ముగ్గురు యువకులు అతని జ్ఞాపకాలను గుండెల్లో పదిలపరుచుకున్నారు.
తమ స్నేహితుడిలా మరొకరి ప్రాణం రోడ్డుపై బలికాకూడదనే ఆశయంతో జోకర్ల వేషధారణలో రోడ్లపైకి వచ్చి వాహనదారులకు అవగాహన కల్పించారు. తాము కోల్పోయిన స్నేహితుడిని తిరిగి తీసుకురాలేకపోయినా,మరొకరి స్నేహాన్ని, మరో కుటుంబ ఆనందాన్ని రోడ్డు ప్రమాదం దూరం చేయకూడదనే గొప్ప సందేశాన్ని చాటారు.




