Nirmal: మామడలో కుక్కల దాడి: ఆరు మేకలు బలి, రైతు ఆవేదన!

Nirmal: నిర్మల్ జిల్లా మామడలో కుక్కల దాడికి రైతు అభికి చెందిన 6 మేకలు మృతి. గతంలోనూ 16 చనిపోగా.. ప్రభుత్వం తనను ఆదుకోవాలని రైతు వేడుకుంటున్నాడు.

THAKUR ANANTH RAM SING, NIRMAL
Published on: 23 July 2026 1:31 PM IST
Nirmal
X

Nirmal: మామడలో కుక్కల దాడి: ఆరు మేకలు బలి, రైతు ఆవేదన!

యాంకర్ పార్ట్: మామడ మండల కేంద్రానికి చెందిన అభి అనే వ్యక్తికి చెందిన మేకల మందపై కుక్కలు దాడి చేయడంతో మేకలు మృతి చెందిన సంఘటన చోటుచేసుకుంది.

వివరాల్లోకి వెళితే అభి అనే వ్యక్తి మేతకు వెళ్లి వచ్చిన మేకల మందను రాత్రి సమయంలో కొట్టంలో వదిలి పెట్టాడు.

అర్ధరాత్రి కొట్టంలోకి చొరబడ్డ కుక్కలు మేకల మందపై దాడి చేయడంతో ఆరు మేకలు మృతి చెందాయి. గతంలో సైతం అభికి చెందిన మేకల మందపై కుక్కలు దాడి చేయడంతో 16 మేకలు మృతి చెందాయని రైతు ఆవేదన వ్యక్తం చేశాడు.

గ్రామంలో కుక్కల బెడద తీవ్రంగా ఉందని, అధికారులకు ఎన్నిసార్లు వినతి పత్రాలు అందజేసిన స్పందించడం లేదని పేర్కొన్నాడు.

ప్రభుత్వం స్పందించి తనను ఆదుకోవాలని కోరాడు.

THAKUR ANANTH RAM SING, NIRMAL

THAKUR ANANTH RAM SING, NIRMAL

Next Story