Adilabad: దసరా పండుగ కరపత్రాలను విడుదల చేసిన కలెక్టర్ రాజర్షి షా!
Adilabad: సనాతన హిందూ ఉత్సవ సమితి ఆధ్వర్యంలో దసరా పండుగ కార్యక్రమాల కరపత్రాలను విడుదల చేసిన జిల్లా కలెక్టర్ రాజర్షి షా. పాల్గొన్న వేద పండితులు, నిర్వాహకులు!
Adilabad: దసరా పండుగ కరపత్రాలను విడుదల చేసిన కలెక్టర్ రాజర్షి షా!
Adilabad: దేవి నవరాత్రి ఉత్సవాల్లో భాగంగా అష్టమి తిథిని పురస్కరించుకుని సనాతన హిందూ ఉత్సవ సమితి ఆధ్వర్యంలో నిర్వహించనున్న దసరా పండుగ కార్యక్రమాల కరపత్రాలను జిల్లా కలెక్టర్ రాజర్షి షా ఆదివారం క్యాంపు కార్యాలయంలో విడుదల చేశారు.వేద పండితులు ఉప్పల సంతోష్ శర్మ వేద పఠనం మధ్య కరపత్రాలను జిల్లా కలెక్టర్ చేతుల మీదుగా ఆవిష్కరించారు. ఈ సందర్భంగా సనాతన హిందూ ఉత్సవ సమితి ప్రతినిధులు కలెక్టర్కు అమ్మవారి చండీయాగ ప్రసాదాన్ని అందజేశారు.
ఈ కార్యక్రమంలో సనాతన హిందూ ఉత్సవ సమితి అధ్యక్షులు ప్రమోద్ కుమార్ ఖత్రి, ప్రధాన కార్యదర్శి రేణికుంట రవీందర్, గౌరవ అధ్యక్షులు కందుల రవీందర్ మహిపాల్, ఊరాడే సుభాష్, విజయ్, రాజు తదితరులు పాల్గొన్నారు.




