Asifabad: హెచ్ఐవీ, ఎయిడ్స్ అవగాహన బైక్ ర్యాలీ.. ప్రారంభించిన కలెక్టర్!
Asifabad: ఆసిఫాబాద్ జిల్లా కేంద్రంలో హెచ్ఐవీ, ఎయిడ్స్పై అవగాహన కల్పించేందుకు నిర్వహించిన బైక్ ర్యాలీని జిల్లా కలెక్టర్ కె. హరిత జెండా ఊపి ప్రారంభించారు.
Asifabad: హెచ్ఐవీ, ఎయిడ్స్ అవగాహన బైక్ ర్యాలీ.. ప్రారంభించిన కలెక్టర్!
Asifabad: కొమురం భీం ఆసిఫాబాద్ జిల్లా: హెచ్ఐవీ, ఎయిడ్స్పై ప్రజల్లో అవగాహన పెంపొందించేందుకు ఆసిఫాబాద్లో బైక్ ర్యాలీ నిర్వహించారు. జిల్లా కలెక్టర్ కె. హరిత జెండా ఊపి ర్యాలీని ప్రారంభించారు.
తెలంగాణ రాష్ట్ర ఎయిడ్స్ నియంత్రణ సంస్థ సహకారంతో ఇంటెన్సిఫైడ్ ఐఈసీ ప్రచారంలో భాగంగా ఈ కార్యక్రమాన్ని చేపట్టారు. హెచ్ఐవీ నివారణ చర్యలు, వ్యాధి వ్యాప్తి పట్ల తీసుకోవాల్సిన జాగ్రత్తలపై ప్రజలకు అవగాహన కల్పించడమే ర్యాలీ ప్రధాన ఉద్దేశమని అధికారులు తెలిపారు.
హెచ్ఐవీపై ఉన్న అపోహలను తొలగించి, వ్యాధి నివారణకు ప్రతి ఒక్కరూ అవగాహనతో వ్యవహరించాలని సూచించారు. ఈ కార్యక్రమంలో వైద్య ఆరోగ్యశాఖ అధికారులు, సిబ్బంది పాల్గొన్నారు.




