Adilabad: ఎయిర్‌పోర్ట్ నిర్వాసితులకు సీపీఎం సంపూర్ణ మద్దతు

Adilabad: ఆదిలాబాద్ ఎయిర్‌పోర్ట్ నిర్మాణంలో భూములు కోల్పోతున్న నిర్వాసితులకు ప్రస్తుత మార్కెట్ రేటు ప్రకారం నష్టపరిహారం చెల్లించాలని సీపీఎం నేత జాన్ వెస్లీ డిమాండ్ చేశారు.

Annijula Srinivas Rao, Staff Reporter -Adilabad
Published on: 25 Sept 2026 4:46 PM IST
Adilabad
X

Adilabad: ఎయిర్‌పోర్ట్ నిర్వాసితులకు సీపీఎం సంపూర్ణ మద్దతు

Adilabad: ఆదిలాబాద్ ఎయిర్పోర్ట్ నిర్మాణంలో భూములు కోల్పోతున్న నిర్వాసితులకు సిపిఎం పార్టీ పోటీ మద్దతునిస్తుందని, న్యాయపరమైన డిమాండ్ సాధించేవరకు వారికి మద్దతుగా పోరాటం సాగిస్తుందని రాష్ట్ర కార్యదర్శి జాన్ వెస్లీ అన్నారు.

ఆదిలాబాద్ రూరల్ మండలంలోని భూ నిర్వాసిత నాలుగు గ్రామాలతో ప్రజలతో సమావేశమయ్యారు జాన్ వెస్లీ.. మార్కెట్లో ఉన్న భూముల మార్కెట్ రేట్ ప్రకారం నష్ట పరిహారం చెల్లించాలని, ఎయిర్పోర్ట్ నిర్మాణాన్ని సిపిఎం స్వాగత్తున్నప్పటికీ నిర్వాసితులకు నష్టం వాటిల్లకుండా చర్యలు తీసుకోవాల్సిన బాధ్యత ప్రభుత్వం పై ఉందని అన్నారు జాన్ వెస్లీ.

తాత కాలం నుంచి సాగు చేస్తున్నటువంటి భూములు ఇక్కడి రైతులకు జీవనాధారం అని మార్కెట్ డిమాండ్ ఆధారంగా పరిహారం చెల్లింపులు జరపాలని లేనిపక్షంలో నిర్వాసితులకు మద్దతుగా పోరాటం తగ్గిస్తామని పేర్కొన్నారు జాన్ వెస్లీ.

ఈ కార్యక్రమంలో పార్టీ రాష్ట్ర కార్యదర్శి వర్గ సభ్యులు బండారి రవికుమార్ రాష్ట్ర కమిటీ సభ్యులు ఉడుత రవి పూసం సచిన్, ఐద్వా రాష్ట్ర ఉపాధ్యక్షులు ఆశాలత, పార్టీ జిల్లా కార్యదర్శి దర్శనాల మల్లేష్. పార్టీ సీనియర్ నాయకులు బండి దత్తత్రి,పార్టీ జిల్లా కార్యదర్శి వర్గ సభ్యులు లంక రాఘవులు, మల్లేష్,అన్నమొల్ల కిరణ్, బొజ్జ ఆశన్న, జిల్లా కమిటీ సభ్యులు R.మంజుల, N. స్వామి, ఆత్రం కిష్టాన్న,R. సురేందర్ పాల్గొన్నారు..

Annijula Srinivas Rao, Staff Reporter -Adilabad

Annijula Srinivas Rao, Staff Reporter -Adilabad

మూడు దశాబ్దాల సుదీర్ఘ అనుభవంతో, ఆదిలాబాద్ జిల్లా రాజకీయ, సామాజిక మరియు గిరిజన ప్రాంతాల పరిణామాలపై అపారమైన పట్టున్న ‘సీనియర్ స్టాఫ్ రిపోర్టర్’.