Adilabad: ఆదిలాబాద్‌లో సీపీఐ ధర్నా.. కరువు సహాయక చర్యలు వెంటనే చేపట్టాలి!
Adilabad: ఆదిలాబాద్ జిల్లాను కరువు ప్రాంతంగా ప్రకటించినా సహాయక చర్యలు చేపట్టకపోవడంపై సీపీఐ నాయకుడు కలవేని శంకర్ ఆగ్రహం వ్యక్తం చేస్తూ కలెక్టరేట్ ఎదుట ధర్నా నిర్వహించారు.
Adilabad: ఆదిలాబాద్‌లో సీపీఐ ధర్నా.. కరువు సహాయక చర్యలు వెంటనే చేపట్టాలి!
Adilabad: ఆదిలాబాద్ జిల్లాను కరువు ప్రాంతంగా ప్రకటించినప్పటికీ, క్షేత్రస్థాయిలో అధికారులు పరిశీలించి సహాయక చర్యలు వేగవంతం చేయకపోవడం విచారకరమని సిపిఐ రాష్ట్ర కార్యదర్శివర్గ సభ్యులు కలవేని శంకర్ ఆరోపించారు.
కరువు సహాయక చర్యలు వెంటనే చేపట్టాలని డిమాండ్ చేస్తూ మంగళవారం కలెక్టరేట్ ఎదుట పార్టీ ఆధ్వర్యంలో ధర్నా చేపట్టారు. కరువు బారిన పడిన మండలాల్లోనూ, గ్రామ పంచాయతీల్లోనూ వ్యవసాయ అధికారులు వెంటనే పర్యటించి, శాస్త్రీయ పద్ధతిలో పంట నష్టాన్ని అంచనా వేయాలని డిమాండ్ చేశారు.
వ్యవసాయ ఆధారిత ప్రాంతాల్లోని రైతాంగానికి తక్షణమే నష్టపరిహారం అందించి ఆదుకోవాలని కోరారు. సిపిఐ జిల్లా కన్వీనర్ విలాస్, నాయకులు ప్రభాకర్ రెడ్డి, దేవేందర్ తదితరులున్నారు.




