Adilabad: ఆదిలాబాద్ జిల్లాలో అక్టోబర్ 12 నుంచి పత్తి కొనుగోళ్లు - కలెక్టర్!
Adilabad: ఆదిలాబాద్ కలెక్టరేట్‌లో పత్తి కొనుగోళ్లపై సమీక్ష. అక్టోబర్ 12 నుంచి ప్రైవేట్, సీసీఐ పత్తి కొనుగోళ్లు ప్రారంభించేలా చర్యలు తీసుకుంటామన్న కలెక్టర్ రాజర్షిషా.
Adilabad: ఆదిలాబాద్ జిల్లాలో అక్టోబర్ 12 నుంచి పత్తి కొనుగోళ్లు - కలెక్టర్!
Adilabad: అక్టోబర్ 12న పత్తి కొనుగోలు ముహూర్తం- జిల్లా కలెక్టర్.. ఆదిలాబాద్ కలెక్టరేట్ సమావేశం మందిరంలో వ్యవసాయ మార్కెటింగ్ శాఖ ఆధ్వర్యంలో పత్తి కొనుగోళ్ల పై సమీక్ష నిర్వహించారు. ఖరీఫ్ మార్కెటింగ్ సీజన్ పత్తి కొనుగోలు సన్నద్ధత, ముందస్తు ఏర్పాట్లపై కలెక్టర్ రాజర్షిషా అధ్యక్షతన సమీక్షించారు.
ఈ సందర్భంగా రైతు సంఘాల నేతలు పలు సూచనలతో పాటు చేపట్టవలసిన ఏర్పాట్లపై అభిప్రాయాలను వ్యక్తం చేశారు. ఎస్పీ అఖిల్ మహాజన్, మార్కెట్ కమిటీ ఛైర్మన్ శ్రీకాంత్ రెడ్డి, ఉన్నారు.ఆదిలాబాద్ జిల్లాలో మహారాష్ట్ర రైతుల పత్తి సైతం కొనుగోలు చేయనున్నారు. ఈ విషయమే కేంద్రం నుంచి జిల్లా కలెక్టర్కు ఆదేశాలు వచ్చాయి. మహారాష్ట్ర పత్తికి రెండు జిన్నింగ్లు కేటాయిస్తామని, అందులో మాత్రమే కొనుగోలు ఉంటుందని కలెక్టర్ రాజర్షిషా పేర్కొన్నారు.
మహారాష్ట్ర కిన్వట్, మాహోర్ల నుంచి 176 గ్రామాల నుంచి జిల్లాకు పత్తి రానుంది.మహారాష్ట్ర నుంచి 10 లక్షల క్వింటాళ్ల పత్తి వస్తుందని అంచనా వేస్తున్నారు. కాగా ఈసారి వచ్చేనెల 12 నుంచి ప్రైవేట్ కొనుగోలు ప్రారంభిస్తామని వ్యాపారులు హామీ ఇవ్వగా, CCI మాత్రం వచ్చే నెల 21వ తేదీ నుంచి పత్తి కొనుగోలను ప్రారంభిస్తామని స్పష్టం చేసింది.
అయితే రైతుల విజ్ఞప్తి మేరకు సీసీఐ తో పాటు ప్రైవేట్ కొనుగోలు ఇదే నెల 12వ తేదీన ప్రారంభించాలని రైతు సంఘాలు కలెక్టర్ విజ్ఞప్తి చేయక ఆ దిశగా ఉన్నతాధికారులతో మాట్లాడి ప్రైవేటు సీసీఐ కొనుగోలు వచ్చే నెల అక్టోబర్ 12 వ తేదీ నుంచి ప్రారంభించే విధంగా చర్యలు తీసుకుంటామని పేర్కొన్నారు జిల్లా కలెక్టర్.




