Adilabad: వ్యవసాయ మార్కెట్‌లో ఘనంగా పత్తి కొనుగోళ్లు ప్రారంభం!

Adilabad: ఆదిలాబాద్ వ్యవసాయ మార్కెట్‌లో క్వింటాల్‌కు రూ. 9,269 ధరతో పత్తి కొనుగోళ్లు ప్రారంభం. కలెక్టర్ రాజర్సీ షా ప్రారంభోత్సవం, సీసీఐ మద్దతు ధర రూ. 8,866.

Annijula Srinivas Rao, Staff Reporter -Adilabad
Published on: 22 Oct 2026 12:37 PM IST
Adilabad
X

Adilabad: వ్యవసాయ మార్కెట్‌లో ఘనంగా పత్తి కొనుగోళ్లు ప్రారంభం!

Adilabad: క్వింటాల్ 9269 ధరతో పత్తి కొనుగోలు ప్రారంభం.. ఆదిలాబాద్ వ్యవసాయ మార్కెట్ యార్డ్ లో పత్తి విక్రయానికి తీసుకొచ్చే రైతులకు ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా అన్ని రకాల చర్యలు చేపడుతున్నామని జిల్లా కలెక్టర్ రాజర్సీ షా అన్నారు.. వ్యవసాయ మార్కెట్ యార్డులో పత్తి పంట కొనుగోలను జిల్లా కలెక్టర్ చేతుల మీదుగా ప్రారంభించారు.

భారత కాటన్ కార్పొరేషన్ సిసిఐ కొనుగోలుకు ముందుకు వచ్చి8866 రూపాయల మద్దతు ధరతో కొనుగోలు జరుపుతామని ప్రకటించగా, యార్డులో నిర్వహించిన వేలంపాటలో ప్రైవేట్ వర్తకులు కూడా పాల్గొని పత్తి ధరను మొదటి రోజు క్వింటాలుకు 9260 జెండా పాట ద్వారా నిర్ణయించారు. ఇదే ధరతో కొనుగోలు ప్రారంభం కాగా, ప్రతిరోజు కూడా వేలంపాట ద్వారానే ధర నిర్ణయించడం జరుగుతుందని, రైతులు నాణ్యమైన పత్తిని మార్కెట్ కి తీసుకొచ్చి మంచి ధరలు పొందాలని కోరారు జిల్లా కలెక్టర్.

ఈ కార్యక్రమంలో మార్కెట్ చైర్మన్ శ్రీకాంత్ రెడ్డి, మున్సిపల్ చైర్మన్ అనూష, ప్రైవేట్ వ్యాపారస్తులు రాజ్ కుమార్ మిత్తల్, దినేష్ రెడ్డి, మనీష్ మాల్పాని, డిసిసి అధ్యక్షుడు నరేష్ జాదవ్, మాజీ డిసిసి అధ్యక్షుడు సాజిద్ ఖాన్, రైతులు రైతు సంఘాల నేతలు పాల్గొన్నారు.

Annijula Srinivas Rao, Staff Reporter -Adilabad

Annijula Srinivas Rao, Staff Reporter -Adilabad

మూడు దశాబ్దాల సుదీర్ఘ అనుభవంతో, ఆదిలాబాద్ జిల్లా రాజకీయ, సామాజిక మరియు గిరిజన ప్రాంతాల పరిణామాలపై అపారమైన పట్టున్న ‘సీనియర్ స్టాఫ్ రిపోర్టర్’.