Adilabad: మార్కెట్ యార్డ్‌లో పత్తి రైతుకు తప్పని మధ్యవర్తి మోసం!

Adilabad: ఆదిలాబాద్ మార్కెట్ యార్డ్‌కు పత్తి తెచ్చిన రైతును మధ్యవర్తి మోసం చేశాడు. కమిషన్ పేరుతో డబ్బులు కాజేసి వేధిస్తున్న వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.

Annijula Srinivas Rao, Staff Reporter -Adilabad
Published on: 18 Nov 2026 10:33 AM IST
Adilabad
X

Adilabad: మార్కెట్ యార్డ్‌లో పత్తి రైతుకు తప్పని మధ్యవర్తి మోసం!

Adilabad: ఆదిలాబాద్ వ్యవసాయ మార్కెట్ యార్డ్ లో అమాయక పత్తి రైతు మధ్యవర్తి చేతిలో మోసపోయిన వీడియో వైరల్ అవుతుంది. కొమరం భీం జిల్లా కెరమెరి మండలం లక్మాపూర్ గ్రామానికి చెందిన రాంప్రసాద్ అనే పత్తి రైతు పికప్ గూడ్స్ వాహనంలో తాను పండించిన 25 క్వింటాళ్ల పైచిలుకు పత్తిని మంగళవారం ఆదిలాబాద్ వ్యవసాయ మార్కెట్ యార్డ్ కు అమ్మకానికి తీసుకొచ్చాడు.

అయితే ఓ మధ్యవర్తి అక్కడే తాను పత్తి అందిస్తానని, వచ్చిన పైకం డబ్బులన్నీ లెక్క కట్టి మరీ ఇస్తామని, తనకు మాత్రం వెయ్యి రూపాయలు కమిషన్ ఇవ్వాలని మొదట ఒప్పందం చేసుకొని సదరు మధ్యవర్తి రైతు వద్ద వేయి రూపాయలు తీసుకొని క్వింటాల్కు9120 ధరతో ఓ ప్రైవేట్ మిల్లు లో విక్రయించాడు.

అయితే తిరిగి మార్కెట్ యార్డ్ కు ఖాళీ బండి తూకం వేసిన అనంతరం తనకు రావలసిన రెండు లక్షల 28 వేల 900 రూపాయల డబ్బును తనకు ఇవ్వాలని పట్టుబట్టాడు. అయితే రెండు లక్షల 26 వేల రూపాయల నగదు మాత్రం రైతుకి ఇచ్చి, 2900 రూపాయలు అడత్ కమిషన్ అంటూ కాజేసే ప్రయత్నం చేశాడు.

దీంతో సదరు రైతు తనకు మొత్తం చెల్లిస్తావని ముందు చెప్పి వేయి రూపాయలకి ఒప్పందం చేసుకున్నామని, తనకు పూర్తి డబ్బులు ఇవ్వాలని పట్టు పట్టిన డబ్బులు ఇవ్వకపోగా, సదరు బాధిత రైతు అధికారులకు ఫిర్యాదు చేస్తానని దాదాపు అరగంట పాటు వాగ్వాదానికి దిగిన వీడియో వైరల్ అవుతుంది.

అయితే దాదాపు 60 కిలోమీటర్ల దూరం నుంచి పక్క జిల్లా నుంచి, ఆదిలాబాద్ వ్యవసాయ మార్కెట్ యార్డ్ లో ధర ఎక్కువ ఉందని పత్తి పంటను విక్రయానికి తీసుకొస్తే ఇక్కడ మధ్యవర్తులు నిలువు దోపిడి చేస్తున్నారని ఆరోపిస్తున్నారు.

సదరు బాధ్యత రైతు రైతుల అమాయకత్వాన్ని మార్కెట్ యార్డ్ లో దర్జాగా మధ్యవర్తులు సొమ్ము చేసుకుంటున్న అధికారులు ఎవరూ పట్టించుకోవడంలేదని,, తనలాగే ఇంకో రైతు నష్టపోకుండా ఉండే విధంగా చూడాలని సదరు రైతు పేర్కొంటున్నారు.

Annijula Srinivas Rao, Staff Reporter -Adilabad

Annijula Srinivas Rao, Staff Reporter -Adilabad

మూడు దశాబ్దాల సుదీర్ఘ అనుభవంతో, ఆదిలాబాద్ జిల్లా రాజకీయ, సామాజిక మరియు గిరిజన ప్రాంతాల పరిణామాలపై అపారమైన పట్టున్న ‘సీనియర్ స్టాఫ్ రిపోర్టర్’.