Nirmal: కేంద్ర ప్రభుత్వ విధానాలపై కాంగ్రెస్ సమరశంఖం నిర్మల్‌లో భారీ నిరసన!

Nirmal: కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వ ప్రజాస్వామ్య వ్యతిరేక విధానాలను నిరసిస్తూ నిర్మల్ జిల్లా ఖానాపూర్ నియోజకవర్గంలో ఎమ్మెల్యే వెడ్మ బొజ్జు పటేల్ ఆధ్వర్యంలో బ్లాక్ డే నిరసన.

RAKESH N, KHANAPUR
Published on: 8 Oct 2026 12:18 PM IST
Nirmal
X

Nirmal: కేంద్ర ప్రభుత్వ విధానాలపై కాంగ్రెస్ సమరశంఖం నిర్మల్‌లో భారీ నిరసన!

Nirmal: నిర్మల్ జిల్లా డీసీసీ అధ్యక్షులు, ఖానాపూర్ నియోజకవర్గ ఎమ్మెల్యే గౌరవనీయులు శ్రీ వెడ్మ బొజ్జు పటేల్ ఆదేశాల మేరకు నియోజకవర్గ కేంద్రంలో భారీ నిరసన కార్యక్రమానికి కాంగ్రెస్ శ్రేణులు సిద్ధమయ్యాయి.

కేంద్ర బీజేపీ ప్రభుత్వం ప్రజాస్వామ్య విలువలను, రాజ్యాంగ స్ఫూర్తిని పూర్తిగా దెబ్బతీసే విధంగా వ్యవహరిస్తోందని ఎమ్మెల్యే వెడ్మ బొజ్జు పటేల్ తీవ్రంగా మండిపడ్డారు. దేశంలో ప్రతిపక్షాల గొంతు నొక్కే ప్రయత్నం జరుగుతోందని ధ్వజమెత్తారు. ఇందులో భాగంగానే కాంగ్రెస్ పార్టీ జాతీయ నాయకులు శ్రీ రాహుల్ గాంధీ , శ్రీమతి ప్రియాంక గాంధీ, ఏఐసీసీ అధ్యక్షులు శ్రీ మల్లికార్జున ఖర్గే తో పాటు, INDIA కూటమి ఎంపీలపై జరిగిన దౌర్జన్యాన్ని ఆయన తీవ్రంగా ఖండించారు.

కేంద్ర ప్రభుత్వ నియంతృత్వ ధోరణిని నిరసిస్తూ కాంగ్రెస్ పార్టీ పిలుపు మేరకు నియోజకవర్గ వ్యాప్తంగా “బ్లాక్ డే” నిరసన కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నట్లు ప్రకటించారు. ఖానాపూర్ నియోజకవర్గంలోని దస్తురాబాద్ మండల కాంగ్రెస్ పార్టీ ప్రజాప్రతినిధులు, మండల, గ్రామ కమిటీల నాయకులు, అనుబంధ సంఘాల ప్రతినిధులు మరియు సర్పంచులు వర్ధిల్లి గోపాల్, సింగారి విజయ కిషన్, కోల మహేష్, మండల కార్యకర్తలు పాల్గొన్నారు.

RAKESH N, KHANAPUR

RAKESH N, KHANAPUR