Nirmal: గోదావరి పుష్కరాల పనులు గడువులోగా పూర్తి కావాలి!

Nirmal: గోదావరి పుష్కరాల పనులు గడువులోగా పూర్తి చేయాలి దేవాదాయ శాఖ ముఖ్య కార్యదర్శి శైలజా రామయ్యర్ ఆదేశం నిర్మల్ కలెక్టర్ భవేశ్ మిశ్రాతో ఉన్నత స్థాయి వీడియో కాన్ఫరెన్స్.

THAKUR ANANTH RAM SING, NIRMAL
Published on: 3 Oct 2026 7:46 PM IST
Nirmal
X

Nirmal: గోదావరి పుష్కరాల పనులు గడువులోగా పూర్తి కావాలి!

నిర్మల్: గోదావరి పుష్కరాల పనులన్నీ గడువులోగా రాష్ట్ర దేవాదాయ శాఖ సెక్రటరీ శైలజా రామయ్యర్ కలెక్టర్లను ఆదేశించారు. శనివారం సాయంత్రం దేవాదాయ శాఖ ప్రిన్సిపల్ సెక్రటరీ శైలజా రామయ్యర్, దేవాదాయ శాఖ కమిషనర్ హనుమంతరావుతో కలిసి హైదరాబాదు నుంచి పలు జిల్లాల కలెక్టర్లతో పుష్కరాల పనులపై వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు.

ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ, పుష్కరాల పనులను కలెక్టర్లు, నోడల్ అధికారులు క్షేత్రస్థాయిలో ఎప్పటికప్పుడు పర్యవేక్షిస్తూ ఉండాలన్నారు. పుష్కరాలకు అవసరమైన భూసేకరణకు చర్యలు తీసుకోవాలని పేర్కొన్నారు. పుష్కరాల పనులపై పలు కీలక సూచనలు చేశారు. పనులు పూర్తి చేయడానికి గడువు నిర్ణయించుకొని, ఆ గడువులోగా పనులు పూర్తి చేయాలని తెలిపారు. సంబంధిత శాఖల అధికారులు పుష్కరాల పనులను సమన్వయంతో చేపట్టాలని అన్నారు. నిర్మాణ పనులకు ఇసుక కొరత తలెత్తకుండా కలెక్టర్లు చర్యలు తీసుకోవాలని తెలిపారు.

కలెక్టరేట్ లోని సమావేశ మందిరం నుంచి ఈ వీడియో కాన్ఫరెన్స్ లో జిల్లా కలెక్టర్ భవేశ్ మిశ్రా పాల్గొన్నారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ, బాసరతో పాటు, జిల్లాలో పుష్కరాలు జరిగే అన్ని ప్రాంతాల్లో పకడ్బందీగా పనులు చేపడుతున్నట్లు వివరించారు. సంబంధిత అన్ని శాఖల సమన్వయంతో పనులు గడువులోగా పూర్తయ్యేలా చూస్తామన్నారు. పుష్కరాల పనులు నాణ్యవంతంగా చేపడతామని తెలిపారు. పనులను నిరంతరం పర్యవేక్షిస్తామన్నారు. ఈ వీడియో కాన్ఫరెన్స్ లో నీటిపారుదల, ఆర్ అండ్ బి, ఆర్డబ్ల్యూఎస్, నీటిపారుదల లు సుభాష్, అనిల్, సందీప్, ఇతర అధికారులు, సిబ్బంది, తదితరులు పాల్గొన్నారు.

THAKUR ANANTH RAM SING, NIRMAL

THAKUR ANANTH RAM SING, NIRMAL