Adilabad: పత్తి కొనుగోళ్లకు ఏర్పాట్లు - కలెక్టర్ రాజర్సీ షా సమీక్ష!
Adilabad: ఆదిలాబాద్ జిల్లాలో పత్తి కొనుగోళ్లపై కలెక్టరేట్‌లో సన్నాహక సమావేశం. మద్దతు ధర రూ.8,667గా ప్రకటన, సీసీఐ ఆధ్వర్యంలో 11 కేంద్రాల ఏర్పాటు.
Adilabad: పత్తి కొనుగోళ్లకు ఏర్పాట్లు - కలెక్టర్ రాజర్సీ షా సమీక్ష!
Adilabad: ఆదిలాబాద్ జిల్లా కలెక్టరేట్ లో పత్తి కొనుగోళ్లపై సన్నాహక సమావేశం నిర్వహించారు..ఈ సమావేశం లో కలెక్టర్ రాజర్సీ షా , ఎస్పీ అఖిల్ మహాజన్ , సిసిఐ అధికారులు, మార్కెట్, మున్సిపల్ చైర్మన్లు, జిన్నింగ్ ప్రెస్సింగ్ యజమానులు, రైతు సంఘాల నేతలు. ప్రస్తుతం మరో పక్షం రోజుల్లో పత్తి పంట రైతుల చేతికి అందనున్న నేపథ్యం లో అక్టోబర్ రెండు లేదా మూడో వారంలో కొనుగోళ్లు చేసే ఎర్పాట్లు చేపట్టాలని రైతులు డిమాండ్ చేసారు.
కాగా భారత కాటన్ కార్పొరేషన్ సీసీఐ ఆధ్వర్యం లో జిల్లాలో 11 కొనుగోలు కేంద్రాలు ఎర్పాట్లు చేస్తున్నట్లు సీసీఐ అధికారులు పేర్కొనంగా, ప్రభుత్వ మద్దత్తు ధర 8667 తో కొనుగోళ్లు చేపట్టానునమని, రైతులు తేమ శాంతం 8 నుండి 12 శాతం పరిగనలోకి తీసుకుంటామని తెలిపారు. cci అధికారులు. కొనుగోళ్లలో ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా మార్కెట్ యర్డ్ లో ఏర్పాట్లు చేపట్టాలని కలెక్టర్ అధికారులను ఆదేశించారు.
కొనుగోళ్ళ తేదీని త్వరలో ప్రకటిస్తామని తెలిపారు అధికారులు. ఈ సమావేశం లో వివిధ రకాల సమస్యలను చర్చించారు..కాగా పొరుగునేఉన్న మహారాష్ట్ర లోని కిన్వాట్, మహోర్ ప్రాంతం రైతుల పత్తి పంటను ఈ సారి ఆదిలాబాద్ లో కొనుగోళ్ళ విషయం పై కూడా చర్చ సాగింది. సమావేశంలో raitu సంఘ నేతలు బండి దత్తాత్రి, లంక రాఘవులు, రమేష్, బొర్రన్న, మహారాష్ట్ర కు చెందిన అధికారులు, రైతులు పాల్గొన్నారు.




