Nirmal: ఇసుక అక్రమ రవాణాపై కఠిన చర్యలు తీసుకోవాలి.. కలెక్టర్!
Nirmal: నిర్మల్ జిల్లాలో ఇసుక అక్రమ రవాణాను అరికట్టాలని, భూముల రీ సర్వేను గడువులోగా పూర్తి చేయాలని సమీక్షా సమావేశంలో అధికారులను జిల్లా కలెక్టర్ భవేశ్ మిశ్రా ఆదేశించారు.
Nirmal: ఇసుక అక్రమ రవాణాపై కఠిన చర్యలు తీసుకోవాలి.. కలెక్టర్!
Nirmal: ఇసుక అక్రమ రవాణాపై కఠిన చర్యలు తీసుకోవాలని జిల్లా కలెక్టర్ భవేశ్ మిశ్రా అధికారులను ఆదేశించారు.
జిల్లా కలెక్టర్ భవేశ్ మిశ్రా శనివారం సాయంత్రం కలెక్టరేట్లోని సమావేశ మందిరంలో ఇసుక అక్రమ రవాణాపై చర్యలు, భూముల రీ సర్వే, ఇతర రెవెన్యూ అంశాలపై సంబంధిత అధికారులతో సమీక్షా సమావేశం నిర్వహించారు.
ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, జిల్లాలో ఇసుక అక్రమ రవాణాను పూర్తి స్థాయిలో అరికట్టాల్సిన బాధ్యత అధికారులపై ఉందన్నారు. ఇసుక అక్రమ తవ్వకాలు, రవాణా చేసే వారిపై చట్ట ప్రకారం కఠిన చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. జరిమానాలు విధించి, వాహనాలు జప్తు చేయాలన్నారు. ప్రభుత్వ ఆదాయానికి గండి పడకూడన్నారు. ప్రభుత్వ, ప్రైవేటు నిర్మాణాలకు కేవలం టిజిఎండిసి లేదా మన ఇసుక వాహనం యాప్ ద్వారా మాత్రమే ఇసుక పొందాలని తెలిపారు.
భూముల రీ సర్వే వివరాలను మండలాల వారీగా సమీక్షించారు. జిల్లాలో 19 మండలాలకు 21 సర్వే పరికరాలు ( రోవర్లు) ఉన్నాయని, స్పష్టమైన ప్రణాళికలతో గడువులోగా రీ సర్వే ప్రక్రియను పూర్తి చేయాలని స్పష్టం చేశారు. జిల్లాకు మరిన్ని సర్వే యంత్రాలు అందుబాటులోకి తీసుకువస్తామని చెప్పారు. ప్రతి సర్వే సిబ్బందికి టోపీ, తాగునీరు, ఓఆర్ఎస్ పొట్లాలతో కూడిన కిట్ లను అందించాలని తెలిపారు.
ఈ సమావేశంలో అదనపు కలెక్టర్ (రెవెన్యూ) వెంకట మాధవ రావు, భైంసా సబ్ కలెక్టర్ అజ్మీరా సంకేత్ కుమార్, ఆర్డీవో దేవీదాస్, డిప్యూటీ కలెక్టర్ రాకేష్, ఇతర అధికారులు, సిబ్బంది, తదితరులు పాల్గొన్నారు.




