Nirmal: ప్రజావాణి దరఖాస్తులను త్వరితగతిన పరిష్కరించాలి!

Nirmal: నిర్మల్ జిల్లా కలెక్టరేట్‌లో నిర్వహించిన ప్రజావాణిలో కలెక్టర్ భవేశ్ మిశ్రా ప్రజల నుంచి అర్జీలను స్వీకరించారు.

THAKUR ANANTH RAM SING, NIRMAL
Published on: 19 Oct 2026 3:35 PM IST
Nirmal
X

Nirmal: ప్రజావాణి దరఖాస్తులను త్వరితగతిన పరిష్కరించాలి!

నిర్మల్: ప్రజావాణి దరఖాస్తులను త్వరితగతిన పరిష్కరించాలని జిల్లా కలెక్టర్ భవేశ్ మిశ్రా అధికారులను ఆదేశించారు. సోమవారం కలెక్టరేట్ సమావేశ మందిరంలో నిర్వహించిన ప్రజావాణి కార్యక్రమంలో కలెక్టర్ పాల్గొన్నారు. ప్రజల నుంచి వచ్చిన ఫిర్యాదులను ఆయన స్వయంగా స్వీకరించారు.

ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ, ఆయా శాఖల అధికారులు ప్రతి దరఖాస్తును క్షుణ్ణంగా పరిశీలించి, తక్షణమే స్పందించాలని అధికారులకు సూచించారు. మండలాల వారీగా పెండింగ్లో ఉన్న ప్రజావాణి దరఖాస్తులకు సంబంధించి సమస్యలను వెంటనే పరిష్కరించాలన్నారు. ప్రజల సమస్యలను సంబంధిత శాఖలు సమన్వయంతో పరిష్కరించేలా పనిచేయాలని సూచించారు.

ప్రజావాణి కార్యక్రమంలో భాగంగా, ప్రజలు విద్య, వైద్యం, ఇందిరమ్మ ఇండ్లు, పింఛన్లు, భూ సమస్యలకు సంబంధించి దరఖాస్తులను కలెక్టర్ కు సమర్పించారు.

అనంతరం జిల్లా లీడ్ బ్యాంకు మేనేజర్ రామ్ గోపాల్ ఆధ్వర్యంలో 'ఫైనాన్షియల్ ఇన్‌క్లూజన్ సాచురేషన్ క్యాంపెయిన్' కు సంబంధించిన గోడ ప్రతులను ఆవిష్కరించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ, ఈనెల 21వ తేదీ నుంచి నెలరోజు 'ఫైనాన్షియల్ ఇన్‌క్లూజన్ సాచురేషన్ క్యాంపెయిన్' కార్యక్రమాన్ని విస్తృత స్థాయిలో నిర్వహించాలని తెలిపారు.

ఈ ప్రజావాణి కార్యక్రమంలో అదనపు కలెక్టర్ రాథోడ్ రమేష్, వెంకట మాధవ రావు, వివిధ శాఖల అధికారులు, సిబ్బంది, తదితరులు పాల్గొన్నారు.

THAKUR ANANTH RAM SING, NIRMAL

THAKUR ANANTH RAM SING, NIRMAL