Gudihathnoor: గుడిహత్నూర్‌లో ఘనంగా సీఎం రేవంత్ రెడ్డి జన్మదిన వేడుకలు

Gudihathnoor: ఆదిలాబాద్ జిల్లా గుడిహత్నూర్ మండల కేంద్రంలో కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో సీఎం రేవంత్ రెడ్డి జన్మదిన వేడుకలు ఘనంగా నిర్వహించి కేక్ కట్ చేశారు.

NAGULA SATISH, BOATH
Published on: 8 Nov 2026 7:04 PM IST
Gudihathnoor
X

Gudihathnoor: గుడిహత్నూర్‌లో ఘనంగా సీఎం రేవంత్ రెడ్డి జన్మదిన వేడుకలు

​గుడిహత్నూర్: తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి ఎనుముల రేవంత్ రెడ్డి జన్మదిన వేడుకలను ఆదివారం గుడిహత్నూర్ మండల కేంద్రంలో కాంగ్రెస్ పార్టీ శ్రేణులు ఘనంగా నిర్వహించాయి. కాంగ్రెస్ పార్టీ మండల కమిటీ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన ఈ కార్యక్రమంలో నాయకులు, కార్యకర్తలు కేక్ కట్ చేసి ఒకరికొకరు తినిపించుకుంటూ సంబరాలు జరుపుకున్నారు.

ప్రజా సంక్షేమమే ధ్యేయంగా ముందుకు సాగుతున్న ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నిండు నూరేళ్లు ఆయురారోగ్యాలతో వర్ధిల్లాలని, భవిష్యత్తులో మరిన్ని ఉన్నత విజయాలు సాధించాలని నాయకులు ఆకాంక్షించారు.

​ఈ వేడుకల్లో మండల కాంగ్రెస్ పార్టీ ఉపాధ్యక్షులు మోహితే మారుతి, సీనియర్ నాయకులు నాగనాథ్ అప్ప, మైనార్టీ సెల్ మండల అధ్యక్షులు సమీర్ ఖాన్, మండల అధికార ప్రతినిధి ఆడే జైపాల్, ప్రధాన కార్యదర్శి కాగ్నే రాంకిషన్, సీనియర్ నాయకులు చెట్ల మహేందర్, మంగ్నలే బాలాజీ, లింగాపూర్ ఉపసర్పంచ్ మొతివార్ గణపతి, మాడవి జ్యోతిరామ్, గోండు ఉమాకాంత్‌లతో పాటు పెద్ద సంఖ్యలో కాంగ్రెస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు పాల్గొని కార్యక్రమాన్ని విజయవంతం చేశారు.

NAGULA SATISH, BOATH

NAGULA SATISH, BOATH