Nirmal: చెక్ పవర్ రద్దు కక్ష సాధింపే: సర్పంచ్ దశరథ్
Nirmal: నిర్మల్ జిల్లా కల్లూర్ సర్పంచ్, ఉప సర్పంచ్లపై కలెక్టర్ 6 నెలల చెక్ పవర్ వేటు వేయడంపై సర్పంచ్ పెంట దశరథ్ మీడియా వేదికగా తీవ్ర ఆరోపణలు చేశారు.
Nirmal: చెక్ పవర్ రద్దు కక్ష సాధింపే: సర్పంచ్ దశరథ్
నిర్మల్ జిల్లా: నిర్మల్ జిల్లా కుంటాల మండలంలోని కల్లూర్ గ్రామ సర్పంచ్, ఉప సర్పంచ్ లపై కలెక్టర్ ఆరు నెలల పాటు చెక్ పవర్ వేటు వేయడంపై సర్పంచ్ పెంట దశరథ్ గురువారం ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో సంచలన ఆరోపణలు చేశారు.
నా భార్య అకౌంట్లో డబ్బులు వేసిన మాట నిజమే. కానీ అది తెలియక చేసిన తప్పు. మేము కొత్తగా ఎన్నికైన సర్పంచ్ లం. మండల అధికారులు మాకు ఎలాంటి దిశానిర్దేశం, మార్గదర్శకాలు ఇవ్వలేదు. వారు మమ్మల్ని సరిదిద్దాలి కానీ ఇలా వేటు వేయడం సరికాదు అని ఆవేదన వ్యక్తం చేశారు.
ఇదే తప్పు నియోజకవర్గంలో బీజేపీతో సహా ఎంతో మంది సర్పంచ్ లు తమ సొంత అకౌంట్లలో చేస్తున్నారు. నేను ఎవరినీ కావాలని తప్పు పట్టడం లేదు, వాళ్లు కూడా తెలియకనే చేస్తున్నారు. వారి పూర్తి సమాచారాన్ని నేనే కలెక్టర్ గారికి ఇచ్చాను. కానీ వారిపై చర్యలు లేవు. నాపై, మా ఉప సర్పంచ్ పై మాత్రమే ఆరు నెలల పాటు చెక్ పవర్ కట్ చేసి సస్పెన్షన్ ఆర్డర్ వేశారు. అందరికీ ఒకే న్యాయం ఉండాలి" అని డిమాండ్ చేశారు.
ఈ చర్య వెనుక ముధోల్ ఎమ్మెల్యే పవర్ రామారావు పటేల్, భైంసా మున్సిపల్ చైర్మన్ దత్తాత్రేయలు ఉన్నారని, వారు కలెక్టర్ పై ఒత్తిడి తెచ్చి ఈ వేటు వేయించారని ఆరోపించారు.
మేము చేసిన ప్రతి అభివృద్ధి పనికి అధికారుల సంతకాలు, పంచాయతీ తీర్మానాలు ఉన్నాయి. గ్రామ అభివృద్ధిని ఓర్వలేకనే కుట్ర పన్నారు. మేము అభివృద్ధికే కట్టుబడి ఉన్నాం. రానున్న రోజుల్లో దీనికి ప్రతికారం ఉంటుంది అని హెచ్చరించారు.




