Adilabad: జాతీయ రహదారిపై అగ్నికి ఆహుతైన కారు.. దంపతులకు తప్పిన ప్రాణాపాయం!

Adilabad: ఆదిలాబాద్ జిల్లా గుడిహత్నూర్ జవహర్ నగర్ సమీపంలో కదులుతున్న ఫోర్డ్ ఎకోస్పోర్ట్ కారులో మంటలు చెలరేగి పూర్తిగా దగ్ధమైంది.

NAGULA SATISH, BOATH
Published on: 29 Nov 2026 11:01 AM IST
Adilabad
X

Adilabad: జాతీయ రహదారిపై అగ్నికి ఆహుతైన కారు.. దంపతులకు తప్పిన ప్రాణాపాయం!

Adilabad: ఆదిలాబాద్ జిల్లా గుడిహత్నూర్ మండల కేంద్రంలోని జవహర్ నగర్ సమీపంలో జాతీయ రహదారిపై ఆదివారం కదులుతున్న ఫోర్డ్ ఎకోస్పోర్ట్ (Ford EcoSport) కారులో అకస్మాత్తుగా మంటలు చెలరేగి పూర్తిగా దగ్ధమైంది. అయితే కారులో ప్రయాణిస్తున్న భార్యాభర్తలు సమయస్ఫూర్తితో వ్యవహరించి వెంటనే కిందకు దిగిపోవడంతో పెను ప్రాణాపాయం తప్పింది.

​బాధితుడు వినోద్ కుమార్ తెలిపిన వివరాల ప్రకారం, ఆయన తన భార్య నీలిమతో కలిసి ఒక ఫంక్షన్‌కు హాజరయ్యేందుకు తమ ఎకోస్పోర్ట్ కారులో మెట్‌పల్లి నుండి ఆదిలాబాద్‌కు బయలుదేరారు. మార్గమధ్యంలో కారు గుడిహత్నూర్ జవహర్ నగర్ సమీపానికి చేరుకోగానే వాహనంలోని డిస్ప్లే బోర్డుపై ఒక్కసారిగా ఎర్రర్ సిగ్నల్ కనిపించింది. అదే సమయంలో ఇంజిన్ భాగం నుండి పొగలు రావడాన్ని గమనించిన వినోద్ కుమార్ వెంటనే అప్రమత్తమై కారును రోడ్డు పక్కన నిలిపివేశారు. క్షణం కూడా ఆలస్యం చేయకుండా దంపతులిద్దరూ కారులోంచి బయటకు దిగి దూరంగా వెళ్లిపోయారు.

​వారు దిగిన కొద్దిసేపటికే మంటలు ఎకోస్పోర్ట్ కారు మొత్తానికి వ్యాపించి భారీగా ఎగసిపడ్డాయి. సమాచారం అందుకున్న అగ్నిమాపక సిబ్బంది హుటాహుటిన ఘటనా స్థలానికి చేరుకుని మంటలను అదుపులోకి తెచ్చారు. అయితే అప్పటికే కారు పూర్తిగా కాలి బూడిదైంది. ఈ ప్రమాదంలో వాహనం దగ్ధమై ఆస్తి నష్టం వాటిల్లినప్పటికీ, వినోద్ కుమార్, నీలిమ దంపతులు ఎలాంటి గాయాలు లేకుండా సురక్షితంగా బయటపడటంతో స్థానికులు ఊపిరి పీల్చుకున్నారు.

NAGULA SATISH, BOATH

NAGULA SATISH, BOATH