Adilabad: ఆదిలాబాద్ జిల్లాలో అయ్యప్ప ఆలయంలో చోరీ ధ్వంసమైన సీసీ కెమెరాలు
Adilabad: తలమడుగు మండలం సుంకిడి అయ్యప్ప ఆలయంలో దుండగులు చోరీకి పాల్పడ్డారు. సీసీ కెమెరాలు ధ్వంసం చేసి, హుండీ పగులగొట్టి నగదు, వెండి వస్తువులను ఎత్తుకెళ్లారు.
Adilabad: ఆదిలాబాద్ జిల్లాలో అయ్యప్ప ఆలయంలో చోరీ ధ్వంసమైన సీసీ కెమెరాలు
Adilabad: ఆదిలాబాద్ జిల్లా తలమడుగు మండలంలోని సుంకిడి అయ్యప్ప ఆలయంలో గుర్తు తెలియని వ్యక్తులు గత రాత్రి దాదాపు12:00-1:00 ప్రాంతంలో అయ్యప్ప ఆలయంలో చొరబడి సీసీ కెమెరాలు ధ్వంసం చేసి హుండీ పగలగొట్టి అందులో గల నగదు, వెండి వస్తువులను దొంగలించినట్టు ఆలయ కమిటీ సభ్యులు తెలిపారు
ఈ యొక్క ఆలయంలో ఇది నాలుగవసారి దొంగలు చోరబడి అయ్యప్ప కిరీటము, వెండి, బంగారం వస్తువులు నగదు చోరీ అయినట్టు తెలిపారు ఎస్సై రాధికను వివరణ కోరగా డాగ్ స్క్వాడ్ ఫోరెన్సిక్ నిపుణులతో సంఘటన స్థలానికి చేరుకొని కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నామన్నారు...




