Nirmal: నిర్మల్‌లో నేడు బీఆర్ఎస్ రైతు గర్జన.. హాజరుకానున్న కేటీఆర్!
Nirmal: నిర్మల్ జిల్లా కేంద్రంలోని ఎన్టీఆర్ మినీ స్టేడియంలో నేడు బీఆర్ఎస్ రైతు గర్జన సభ నిర్వహణకు ఏర్పాట్లు పూర్తయ్యాయి. కేటీఆర్ ముఖ్య అతిథిగా హాజరుకానున్నారు.
Nirmal: నిర్మల్‌లో నేడు బీఆర్ఎస్ రైతు గర్జన.. హాజరుకానున్న కేటీఆర్!
Nirmal: నిర్మల్ జిల్లా కేంద్రంలో నేడు నిర్వహించనున్న బీఆర్ఎస్ రైతు గర్జన సభకు అన్ని ఏర్పాట్లు పూర్తయ్యాయి. నిర్మల్ జిల్లా కేంద్రంలోని ఎన్టీఆర్ మినీ స్టేడియంలో రైతు గర్జన సభను నిర్వహించనున్నారు. ఈ సభకు సాయంత్రం ఐదు గంటలకు బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ హాజరుకానున్నారు.
సభ ఏర్పాట్లను గత మూడు రోజులుగా మాజీ మంత్రి వేముల ప్రశాంత్ రెడ్డి, మాజీ ఎంపీ బాల్క సుమన్, నిర్మల్ నియోజకవర్గ ఇన్చార్జి రామ్ కిషన్ రెడ్డి, నాయకులు నల్ల వినయ్ రెడ్డి పర్యవేక్షించారు. రైతు గర్జన సభకు సుమారు 30 వేల మంది హాజరయ్యేలా అన్ని ఏర్పాట్లు పూర్తి చేశారు.
రైతు గర్జన సభ సందర్భంగా భారీగా ఫ్లెక్సీల ఏర్పాటుతో నిర్మల్ పూర్తిగా గులాబిమయంగా మారిపోయింది. ఈ సభకు నిర్మల్, ముధోల్, ఖానాపూర్ నియోజకవర్గాల నుండి రైతులను పెద్ద సంఖ్యలో తరలించేందుకు ఆయా నియోజకవర్గ ఇన్చార్జీలు అన్ని ఏర్పాట్లు పూర్తి చేశారు.
సభకు వచ్చే రైతులకు, ప్రజలకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా పోలీసులు ప్రతిష్ట బందోబస్తును చేపడుతున్నారు. అదేవిధంగా ట్రాఫిక్ కు ఇబ్బందులు కలగకుండా వాహనాలను ప్రత్యామ్నాయ మార్గాల ద్వారా మళ్లించేందుకు చర్యలు చేపడుతున్నారు.




