Boath: బోథ్ ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో జాతీయ జెండా ఆవిష్కరణ!

Boath: తెలంగాణ జాతీయ సమైక్యతా దినోత్సవం సందర్భంగా బోథ్ ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో జాతీయ జెండా ఆవిష్కరించిన ఎమ్మెల్యే అనిల్ జాదవ్.

NAGULA SATISH, BOATH
Published on: 17 Sept 2026 9:35 AM IST
Boath
X

Boath: బోథ్ ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో జాతీయ జెండా ఆవిష్కరణ!

Boath: తెలంగాణ జాతీయ సమైక్యతా దినోత్సవం సందర్భంగా బోథ్ ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో ఎమ్మెల్యే అనిల్ జాదవ్ జాతీయ జెండాను ఆవిష్కరించి ప్రజలకు శుభాకాంక్షలు తెలిపారు.

​ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, సెప్టెంబర్ 17 తెలంగాణ చరిత్రలో అత్యంత కీలకమైన రోజని, ప్రజల ఐక్యతకు, ప్రజాస్వామ్య విలువలకు ఇది ప్రతీక అని పేర్కొన్నారు. ఉద్యమకారులు, అమరవీరుల త్యాగాలను స్మరిస్తూ, తెలంగాణ ఆత్మగౌరవం, హక్కుల పరిరక్షణ కోసం బీఆర్ఎస్ పార్టీ ఎల్లప్పుడూ ప్రజల పక్షాన ఉంటుందని స్పష్టం చేశారు. సమాజంలోని అన్ని వర్గాల సంక్షేమం, రాష్ట్ర సమగ్రాభివృద్ధే లక్ష్యంగా ముందుకు సాగాలని పిలుపునిచ్చారు.

​ఈ కార్యక్రమంలో పార్టీ నాయకులు సురేందర్ యాదవ్, రమణ గౌడ్, తాహెర్, ప్రశాంత్, ప్రవీణ్, రాజు రెడ్డి, సుభాష్, ప్రీతం రెడ్డి, దేవేందర్ రెడ్డి, రఫీ, సుజీల్ తదితరులు పాల్గొన్నారు.

NAGULA SATISH, BOATH

NAGULA SATISH, BOATH