Boath: చైల్డ్ పోర్నోగ్రఫీపై పోలీసుల ప్రత్యేక నిఘా: నాలుగు కేసులు
Boath: చిన్నారుల అశ్లీల చిత్రాలు, చైల్డ్ పోర్నోగ్రఫీపై బోథ్ సర్కిల్ పరిధిలో పోలీసులు ప్రత్యేక నిఘా ఉంచి నాలుగు కేసులు నమోదు చేసినట్లు సీఐ గురుస్వామి తెలిపారు.
Boath: చైల్డ్ పోర్నోగ్రఫీపై పోలీసుల ప్రత్యేక నిఘా: నాలుగు కేసులు
బోథ్: చిన్నారుల అశ్లీల చిత్రాలు, వీడియోలు, చైల్డ్ పోర్నోగ్రఫీ వీక్షించడం, వాటిని సోషల్ మీడియాలో అప్‌లోడ్ చేయడం లేదా ఇతరులకు షేర్ చేయడం చట్టరీత్యా తీవ్ర నేరమని బోథ్ సీఐ డి. గురుస్వామి స్పష్టం చేశారు. అటువంటి చట్టవ్యతిరేక చర్యలకు పాల్పడే వారిపై కఠిన చర్యలు తప్పవని ఆయన హెచ్చరించారు.
తెలంగాణ రాష్ట్ర సైబర్ క్రైమ్ విభాగం సహకారంతో ఆదిలాబాద్ జిల్లా బోథ్ సర్కిల్ పరిధిలో ఇలాంటి డిజిటల్ కార్యకలాపాలపై ప్రత్యేక నిఘా ఉంచినట్లు సీఐ తెలిపారు. ఇందులో భాగంగా సాంకేతిక ఆధారాలతో నిందితులను గుర్తించి ఇప్పటివరకు నాలుగు కేసులు నమోదు చేసినట్లు పేర్కొన్నారు. బోథ్ పరిధిలో ఒకరిపై, బజార్‌హత్నూర్ పరిధిలో ముగ్గురిపై కేసులు నమోదు చేసి చట్టపరమైన చర్యలు చేపట్టామని వివరించారు.
ప్రస్తుత డిజిటల్ యుగంలో ప్రతి ఒక్కరూ సామాజిక మాధ్యమాలను బాధ్యతాయుతంగా వినియోగించాలని, చట్టవిరుద్ధమైన ప్రచారాలకు, అసభ్యకర కంటెంట్‌కు దూరంగా ఉండాలని సూచించారు. ముఖ్యంగా తల్లిదండ్రులు తమ పిల్లల మొబైల్, ఇంటర్నెట్ వినియోగంపై నిరంతరం పర్యవేక్షణ ఉంచాలని కోరారు. సమాజంలో ఎవరైనా ఇలాంటి చర్యలకు పాల్పడుతున్నట్లు గమనిస్తే వెంటనే స్థానిక పోలీసులకు లేదా సైబర్ క్రైమ్ విభాగానికి సమాచారం అందించాలని సీఐ గురుస్వామి విజ్ఞప్తి చేశారు.




