Nirmal: ముథోల్‌లో బీజేపీ వర్సెస్ బీఆర్ఎస్.. 24 గంటల్లో మూడు కండువాలు!
Nirmal: నిర్మల్ జిల్లా ముథోల్ నియోజకవర్గంలో సర్పంచుల పార్టీ మార్పుల వ్యవహారం బీజేపీ, బీఆర్ఎస్ మధ్య రాజకీయ రచ్చకు దారితీసింది.
Nirmal: ముథోల్‌లో బీజేపీ వర్సెస్ బీఆర్ఎస్.. 24 గంటల్లో మూడు కండువాలు!
Nirmal: నిర్మల్ జిల్లా ముథోల్ నియోజకవర్గంలో బీజేపీ వర్సెస్ బీఆర్ఎస్ రాజకీయం రసవత్తరంగా మారింది. సర్పంచుల పార్టీ మార్పుల వ్యవహారం రెండు పార్టీల మధ్య రాజకీయ రచ్చకు తెరలేపింది. 24 గంటల్లో మూడు సార్లు కండువాలు మారడంతో అసలు ఏ పార్టీలో ఉన్నారో తెలియని పరిస్థితి నెలకొంది.
మొదట కేటీఆర్ సమక్షంలో గులాబీ కండువాలు.. మరుసటి రోజు ఎమ్మెల్యే రామారావు పటేల్ సమక్షంలో కాషాయ కండువాలు.. ఇప్పుడు మళ్లీ బీఆర్ఎస్ లోనే కొనసాగుతామంటూ కొందరు సర్పంచుల ప్రకటనలు..!
నేతల ఒత్తిళ్లు, రాజకీయ పరిణామాల మధ్య సర్పంచులు తలొగ్గుతున్నారా అన్న చర్చ మొదలైంది. ఒకరిపై ఒకరు ఆరోపణలు చేసుకుంటున్న బీజేపీ, బీఆర్ఎస్ నేతలతో ముథోల్ రాజకీయం హీటెక్కింది.
24 గంటల్లో మూడు కండువాలు.. ముథోల్ లో రాజకీయ పోరుతో రసవత్తరంగా మారాయి. ఈ పరిణామాలు రాబోయే రోజుల్లో ఇంకా ఏ మలుపులు తిరుగుతాయో చూడాలి.




