Nirmal: అంబరాన్నంటిన బీజేఎల్పీ నేత ఏలేటి మహేశ్వర్ రెడ్డి జన్మదిన వేడుకలు!

Nirmal: నిర్మల్ ఎమ్మెల్యే, బీజేఎల్పీ నేత ఏలేటి మహేశ్వర్ రెడ్డి పుట్టినరోజు వేడుకలు ఘనంగా నిర్వహణ. శుభాకాంక్షలు తెలిపేందుకు బారులు తీరిన అభిమానులు, కార్యకర్తలు.

THAKUR ANANTH RAM SING, NIRMAL
Published on: 22 Sept 2026 4:08 PM IST
Nirmal
X

Nirmal: అంబరాన్నంటిన బీజేఎల్పీ నేత ఏలేటి మహేశ్వర్ రెడ్డి జన్మదిన వేడుకలు!

Nirmal: బీజేపీ శాసనసభ పక్ష నేత, నిర్మల్ ఎమ్మెల్యే ఏలేటి మహేశ్వర్ రెడ్డి జన్మదిన వేడుకలు నిర్మల్‌లో అంబరాన్నంటాయి.

మహేశ్వర్ రెడ్డి పుట్టినరోజు సందర్భంగా శుభాకాంక్షలు తెలిపేందుకు రాష్ట్ర నాయకులతో పాటు జిల్లా నలుమూలల నుంచి నాయకులు, పార్టీ కార్యకర్తలు, ప్రజలు, అభిమానులు, విద్యార్థులు భారీ సంఖ్యలో తరలివచ్చారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే ఏలేటి మహేశ్వర్ రెడ్డికి హృదయపూర్వక పుట్టినరోజు శుభాకాంక్షలు తెలిపారు.

పుట్టినరోజు వేడుకల్లో పాల్గొన్న నాయకులు, కార్యకర్తలు, అభిమానులు, విద్యార్థులు ఎమ్మెల్యే కు పుష్పగుచ్ఛాలు అందజేసి, శుభాకాంక్షలు తెలియజేశారు. ప్రజాసేవలో మరింతగా ముందుకు సాగాలని, ఆయురారోగ్యాలతో నిండు నూరేళ్లు జీవించాలని ఆకాంక్షించారు.

ఎమ్మెల్యే జన్మదిన వేడుకలకు భారీగా ప్రజలు, కార్యకర్తలు, అభిమానులు తరలిరావడంతో నిర్మల్‌లో పండుగ వాతావరణం నెలకొంది.

THAKUR ANANTH RAM SING, NIRMAL

THAKUR ANANTH RAM SING, NIRMAL