Nirmal: నిర్మల్లో మార్కెట్ యార్డ్ కాంపౌండ్ వాల్ కూల్చివేత.. బిజెపి నిరసన!
Nirmal: నిర్మల్ జిల్లా కేంద్రంలో మార్కెట్ యార్డ్ కాంపౌండ్ వాల్ కూల్చివేతను నిరసిస్తూ బిజెపి నేతలు, కౌన్సిలర్లు ఆందోళన చేపట్టారు.
Nirmal: నిర్మల్లో మార్కెట్ యార్డ్ కాంపౌండ్ వాల్ కూల్చివేత.. బిజెపి నిరసన!
Nirmal: నిర్మల్ జిల్లా కేంద్రంలోని మార్కెట్ యార్డ్ కాంపౌండ్ వాల్ పూడ్చి నిర్మిస్తున్న వారిపై చర్యలు తీసుకోవాలని బిజెపి నాయకులు డిమాండ్ చేశారు. కూల్చిన మార్కెట్ యార్డ్ కాంపౌండ్ వాల్ను బిజెపి నాయకులు, బిజెపి కౌన్సిలర్లు సందర్శించారు. ఈ సందర్భంగా గూడను కూల్చి నిర్మిస్తున్న వారికి, వారికి సహకరిస్తున్న ప్రజా ప్రతినిధులకు, అధికారులకు వ్యతిరేకంగా నినాదాలు చేశారు.
ఈ సందర్భంగా నాయకులు మాట్లాడుతూ ప్రభుత్వ భూములను ఆక్రమించి భవనాలు నిర్మిస్తున్న అధికారులు చూసీచూడనట్లు వ్యవహరిస్తున్నారన్నారు. ఇప్పటికైనా స్థలం ఆక్రమించిన వారిపై చర్యలు తీసుకొని, నిర్మాణ పనులను వెంటనే ఆపాలని డిమాండ్ చేశారు. లేనట్లయితే రాబోయే రోజుల్లో ఆందోళనలు ఉదృతం చేస్తామని హెచ్చరించారు.




